విదేశాల్లోనే కాదు..దేశంలోనూ అందరి నోళ్లలో నానుతున్న నమో మంత్రపు వేళ్లనూ అన్ని చోట్లా విస్తరించే ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ.తెలుగురాష్ట్రాల్లో కమలనాథులు పట్టునిరూపించుకున్నా…భవిష్యత్తు కార్యచరణ వ్యూహంతో ముందుకెళ్లేలా బీజేపీ జాతీయఅధ్యక్షుడు అమిత్ షా వ్యూహంలా కనిపిస్తోంది.ఇటు తెలంగాణలో పార్టీ పరంగా కొంత ఆశాజనకంగా కనిపిస్తున్నా..అటు ఆంధ్రప్రదేశ్ లోనూ కమల జెండా వికసించటంపైనే అధిష్టానం ఎక్కువ గురిపెట్టింది.ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్న బడా లీడర్లు ఆ పార్టీని వదిలి బీజేపీలో చేరటానికి ఆసక్తిచూపుతున్నారు.మొన్న కన్నాలక్ష్మీనారాయణ కమలతీర్థం పుచ్చుకుంటే…తాజాగా అప్పటి పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణకు గాలం వేసేలా అడుగులేస్తోంది పార్టీ హైకమాండ్.ఇటు కోస్తా అటు ఉత్తరాంథ్రలో బలమైన వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతల్ని కమలం ఊరిస్తోంది.దీంతో ఏపీలో సీనియర్లకు రాజకీయ బెంగపట్టుకుంది. అంతేకాదు..రాష్ట్ర విభజనతో తమ భవిష్యత్తు అంథకారంలా కనిపించటం..కూడబెట్టుకున్న ఆస్తులను కాపాడుకోవటం ఎలా అన్న దానిపైనే సీనియర్ కాంగ్రెస్ లీడర్లు లోలోన భయపడుతున్నారు.దాంతో మేకపోతు గాంభీర్యప్రదర్శించినా..ఏవిధంగా తమ పట్టును సాధించుకోవాలని లబలబలాడిపోతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో కొందరు తెలుగుదేశంలో చేరితే..మరికొందరు ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీలో చేరటానికి క్యూకడుతున్నారు.ఇలా కాంగ్రెస్ లీడర్ల వీక్ నెస్ ను పరిగణలోకి తీసుకున్న అమిత్ షా తెలుగురాష్ట్రాల్లో భవిష్యత్తు బీజేపీ ఉండబోతుందనేలా సంకేతాలివ్వటానికి రెడీ అవుతున్నారు.ఇక మరోవైపు కులాల వారీగా సమీకరణలతో పార్టీని స్ట్రాంగ్ గా తీర్చిదిద్దే అంశంపై అధినాయకత్వం ఎక్కువగా దృష్టిపెట్టింది.అంతేకాదు ప్రాంతాల వారీగా ఆపరేషన్ ఆకర్ష్ తో బొత్స పార్టీలో చేరితే కమల పతాక ఉత్తరాంధ్రలో రెపరెపలాడుతుందనే వాదనలు పార్టీలో వినిపిస్తున్నాయి.అయితే గతంలో బొత్స బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగినా..తీర్థం తీసుకోలేదు.అయితే ఇప్పుడు బొత్స ఏ నిర్ణయం తీసుకుంటారు.బీజేపీలో తాను వెళ్లి చేరకపోయినా…ఉత్తరాంధ్రలో నాకు పట్టుఉందని చూపిమరీ మంచి పార్టీలో మంచిపొజిషన్ కు వెళ్తారా…లేక అస్థిత్వం కోల్పోయిన కాంగ్రెస్ తోనే రాజీపడతారా..అన్నదే బొత్స వర్గీయుల్లో బిగ్ డిస్కషన్.

మరింత సమాచారం తెలుసుకోండి: