నిన్నటి లోక్ సభ సమావేశాల్లో ఆర్జేడీ సభ్యుడు రాజేశ్ రంజన్ (పప్పూయాదవ్) చర్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. మత మార్పిడులపై మధ్యాహ్నం చర్చ నడుస్తుండగా స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్లిన పప్పూయాదవ్... మాత మార్పిడి వార్తలున్న పేపర్లను చూపుతూ, ఆవేశాన్ని అదుపుచేసుకోలేక, పేపర్లు చింపి స్పీకర్ పోడియం వైపు విసిరారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ స్పీకర్ తంబిదురై సభను 10 నిమిషాలు వాయిదా వేశారు.వాయిదా అనంతరం సభ ప్రారంభమైన తర్వాత, తంబిదురై మాట్లాడుతూ... పప్పూయాదవ్ తనపై పేపర్లు విసరడం అభ్యంతరకరమని, స్పీకర్ స్థానాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాల్సిన అవసరం ఉందని అన్నారు. అనంతరం పార్లమెంటు బయట మీడియాతో మాట్లాడిన పప్పూయాదవ్, తాను కావాలని ఆ పని చేయలేదని, కేవలం ఆవేశంలోనే చేశానని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: