ప్రజాస్వామ్యంలో అధికారం ఎప్పుడూ ఒకే పార్టీలో ఉండదు. జనం తీర్పును బట్టి నేతలు, పార్టీల తలరాతలు మారుతూనే ఉంటాయి. కానీ ఆయా పార్టీలు ఏ పొజిషన్లో ఉన్నా.. ఎంత హుందా ప్రవర్తించాయి అన్నదే గీటురాయి. సోమవారం అసెంబ్లీలో అధికారపక్షం వ్యహరించిన తీరు హుందాగా లేదన్న వాదన వినిపిస్తోంది. అధికారపక్షంలో ఉన్నాం కాబట్టి ఎన్నిమాటలైనా అంటాం.. ఎలాగైనా ప్రవర్తిస్తామన్నట్టు టీడీపీకి చెందిన కొందరు నేతలు వ్యవహరించిన తీరు ఆ పార్టీని విమర్శల పాలు చేస్తోంది.                                        ప్రత్యేకించి సీఆర్డీఏ బిల్లు.. ఆమోదం సమయంలో టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం మరీ శ్రుతి మించిందన్న విమర్శలు వస్తున్నాయి. రాజధాని బిల్లుపై విపక్షనేత జగన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తాను ఎప్పుడూ రాజధాని తుళ్లూరు ప్రాంతంలో పెట్టవద్దనలేదని.. మూడు పంటలు పండే భూములు తీసుకోవద్దనే చెబుతున్నామన్నారు. బిల్లులో వివరాలేమీ లేవని విమర్శించారు.                                       ఆయన మాట్లాడి కూర్చోగానే గోరంట్ల బుచ్చయ్య చౌదరి లేచి.. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు.. కోరి కుందేటి కొమ్ము సాధించవచ్చు.. చేరి మూర్ఖుని మనస్సు రంజింపలేము.. విశ్వదాబిరామ వినురవేమ అని పద్యం చదివి మరీ జగన్ ప్రసంగంపై విమర్శలు గుప్పించారు. అంటే నేరుగా జగన్ ఓ మూర్ఖుడని సభాముఖంగా నోరుపారేసుకున్నారు. ఒక్క జగన్ పైనే కాదు.. నిన్న ఆద్యంతం గోరంట్ల ఇలాంటి దుందుడుకు మాటలు మాట్లాడుతూనే ఉన్నారు.                        సినీనటి రోజాను విలన్ అని..వైసీపీ ఎమ్మెల్యేలను రౌడీయిజం చేస్తున్నారనడం.. బీ కేర్ ఫుల్ అని హెచ్చరించడం.. మమల్ని తిట్టీ తిట్టీ ఓ నేత ఏమైపోయాడో అందరికీ తెలుసని విమర్శించడం.. ఇలా ఒకటా రెండో.. వయసు ముదిరిన ప్రభావమో ఏమో గానీ.. గోరంట్ల సోమవారం బాగా రెచ్చిపోయారు. ఇలాంటి నేతలను చంద్రబాబు కట్టడి చేయకపోతే.. పార్టీకే చెడ్డపేరు వస్తుందని గ్రహిస్తే మంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: