గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికల విషయంలో ఎంఐఎం పార్టీ టీఆర్ఎస్ మీద గుర్రుగా ఉందని తెలుస్తోంది. ఢిల్లీ, ముంబయి తరహాలో పరిపాలనా సౌలభ్యం, సమస్యల పరిష్కారానికి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు హైదరాబాద్ నగరాన్ని రెండు లేదా మూడు కార్పోరేషన్లుగా విభజించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే గ్రేటర్ ఎన్నికలను వాయిదా వేసి ఆ దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంఐఎం పార్టీని పాతబస్తీకి పరిమితం చేయడానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని, అందుకే నగరాన్ని మూడు కార్పోరేషన్లుగా విభజించాలని చూస్తుందని ఎంఐఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత నగరంలో భద్రత విషయంలో, మహిళల విషయంలో తీసుకున్న పలు చర్యలు ఆ పార్టీకి ఆదరణ పెరిగింది. ఇక తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డిలతో పాటు పలువురు ముఖ్య నేతలు టీఆర్ఎస్ లో చేరడంతో ఆ పార్టీ బలపడింది. ఇప్పుడు నగరాన్ని కార్పోరేషన్ గా విభజించడం మూలంగా తమను పరిమితం చేస్తున్నారు అన్నది ఎంఐఎం బాధ. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఎలాంటి వైఖరి తీసుకుంటుంది ? అన్నది వేచిచూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: