తుని నియోజవర్గంలో మంత్రి పేరుతో ఆయన తమ్ముడు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే బి రాజా ఆరోపించారు. జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ తుని నియోజకవర్గంలో ఆర్థిక శాఖ మం త్రి తమ్ముడి అరాచకాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. మా అన్నయ్య మంత్రి అని హేచరీస్‌ను బెదిరిస్తూ చెప్పినట్లు వినకపోతే దాడులకు దిగుతున్నారని విమర్శించారు. దీనిపై పోలీసులు సైతం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. నియోజకవర్గాన్ని భ్రష్టుపట్టిస్తూ అరాచకాలకు పాల్పడుతుంటే తమ్ముడిని నియంత్రించ లేని మంత్రి ఇక్కడ మాత్రం ప్రజలకు, నాయకులకు సందేశాలు ఇస్తున్నారని ఆక్షేపించారు. శాసనసభ్యులకు నీతులు చెప్పడం కాదని అరాచకాలకు పాల్పడుతున్న తమ్ముడిని కంట్రోల్‌ చేయాలని వ్యాఖ్యానించారు. ఇంత అరాచకం రాష్ట్రంలో ఎక్కడా జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు తెలుగుదేశం ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజేశ్వరి మాట్లాడుతూ తమ నియోజకవర్గంలోని గిరిజనులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విలీనం చేసిన ఏడు మండలాల్లో తెలంగాణ అధికార్లు ఉండడం వల్ల గిరిజనులకు పూర్తి న్యాయం జరగడం లేదన్నారు. గిరిజన ప్రాంతం కావడంతో తమ నియోజకవ ర్గంలో విద్య, వైద్య, తాగునీరు, విద్యుత్‌ తదితర ప్రధాన సమస్యలను పట్టించుకునేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు సైతం సక్రమంగా రావడం లేదని, తెలంగాణ సర్టిఫికెట్లు ఇవ్వడం వల్ల తీవ్ర ఇబ్బం దులు ఎదురవుతున్నాయని తెలిపారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ సొమ్ములు రావడం లేదని, అటవీ శాఖ అధికార్ల వ్యవహారం కారణంగా రోడ్ల నిర్మాణాలకు అనుమతులు లభించడం లేదని వెల్లడించారు. అదేవిధంగా రేషన్‌ కార్డులు, పెంన్షన్లు సైతం గిరిజనులకు మంజూరు చేయడం లేదని వాపోయారు. జవ హర్‌ మాట్లాడుతూ తమ నియోజకవర్గంలోని కాల్వలకు ఆధునీకరణ పనులు చేపట్టాలన్నారు.  ఏరియా ఆసు పత్రిలో ఉద్యోగులను పూర్తి స్థాయిలో నియమించాలని చెప్పారు. ఇప్పటికే ఉన్న ఉద్యోగులకు జీతాలు లేని పరిస్థితి ఉందని తెలిపారు. బద్వేల్‌ నియోజకవర్గం తోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో పత్తి పండించే రైతు లను ఆదుకోవాలని జయరాములు ప్రభుత్వాన్ని కోరా రు. ఎకరానికి లక్ష రూపాయలను ఖర్చు చేసి రైతులు పత్తి పండిస్తే వారికి గిట్టుబాటు ధరలు కూడా రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని పత్తి రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బి జయనాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బుడగ జంగాలను ఎస్సీలుగా గుర్తించి వారికి కుల ధృవీకరణ పత్రాలు త్వరితగతిన ఇచ్చేటట్లు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విష్ణుకుమార్‌రెడ్డి మాట్లాడుతూ విశాఖ గిరిజన ప్రాంతంలోని అరకు, చింతపల్లి, పాడేరు తదితర ప్రాంతాల్లో వాతావరణంలో విచిత్ర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. శీతాకాలం కావడంతో మైనస్‌ 2 డిగ్రీలకు పడిపోయిందని, గజ గజలాడుతూ విద్యార్థులు స్కూళ్లకు వెళ్లాల్సి వస్తోందన్నారు. వీరికి స్వెట్టర్లను ఏర్పాటు చేయాలని, అలాగే ఇంటికో రగ్గును సరఫరా చేయాలని కోరారు. అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ నెల్లూరులో టైరు బండ్లకు ఉచితంగా ట్రిప్పులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పనులు లేక ఎద్దులను అమ్ముకుని బతకాల్సి వస్తోందని, వారికి ఉచి తంగా రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. అదేవిధంగా నెల్లూరులో అండర్‌గ్రౌండ్‌ సిష్టం, మంచినీటిని రెండు నెలల్లో సరఫరా చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారని, అయితే అది ఇప్పటి వరకూ అమలు కాలేదని చెప్పారు. దానికి సంబంధించిన ఫైలు స్వచ్ఛ భారత్‌ కింద ఎక్కడ పోయిందో తెలపాలని డిమాండ్‌ చేశారు. బెంగుళూరు అనంతపురం జాతీయ రహదారిలో గల వెలిగొండ వద్ద ఫ్లైఓవర్లు, అండర్‌ బ్రిడ్జిలు లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పార్థసారధి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాల్లో పలువురు మృతి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయని తెలిపారు. వీటిని నిర్మించి స్థానికులను ప్రాణాలను రక్షించాలని కోరారు. పెద్దిరెడ్డి మా ట్లాడుతూ తిరుపతిలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో టాపర్‌ అయిన ఒక విద్యార్థి హత్యకు గురయ్యాడని, దీనిపై పోలీ సులు స్పందించడం లేదన్నారు. ఈ కళాశాల మున్సిపల్‌ శాఖా మంత్రిది కావడంతో కేసు నమోదు చేసినా సంబంధిత వ్యక్తులపై ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని ఆరోపించారు. సహచర విద్యార్థులు హత్యకు గురైన విద్యార్థిని ఆసుపత్రికి ఆటోలో తరలిం చినా స్కూలు యాజమాన్యం మాత్రం హత్యకు సంబంధించిన రక్తపు మరకల ను శుభ్రం చేసే పనిలో ఉండడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ హత్యపై స్థానికులు ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేసినా వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ సంఘటనపై విచారణ చేసి బాధ్యు లైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజ మాట్లాడుతూ చిత్తూరులోని సహకార చక్కెర ఫ్యాక్టరీ రెండేళ్లుగా రైతులకు బకాయిలు పడిందని దాంతో వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొం టున్నారని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. రుణ మాఫీ కాక, పాత రుణాలు చెల్లిం చలేక, కొత్త రుణాలు రాక ఆ రైతులు పడరాని పాట్లు పడుతున్నారని తెలిపారు. చిత్తూరు వచ్చిన సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు షుగర్‌ ఫ్యాక్టరీ బకాయిలను 15 రోజుల్లోగా ఇప్పిస్తానని హామీ ఇచ్చినా అది ఇంత వరకూ అమలు కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: