తెలంగాణ రాష్ట్రంలో క్రిస్టమస్‌కు రాష్ట్ర ప్రభు త్వం రెండు రోజుల సెలవు ప్రకటించింది. ప్రస్తుతం 25న ఒక్కరోజే సెలవు దినంగా వుండేది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం 26న కూడా సెలవు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం మంగళ వారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో క్రిస్టమస్‌కు 25, 26న రెండు రోజుల పాటు సెలవు లభించింది. నాంపల్లిలోని లలితా కళా తోరణంలో క్రిస్టియన్‌ కమ్యూనిటి నిర్వహించిన  క్రిస్టమస్‌ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు క్రైస్తవులకు వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే 25తో పాటు 26న కూడా సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. దీంతో పాటు వచ్చే ఏడాది నుంచి క్రిస్ట మస్‌ భవన్‌లోనే క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించుకుందామని చెప్పిన సీఎం కేసీఆర్‌ ఆ మేరకు చర్యలు తీసుకు న్నారు. మంగళవారమే సికింద్రాబాద్‌లోని రెండెకరాల స్థలంలో ఈ భవనాన్ని నిర్మించేందుకు సీఎం శంకుస్థాపన సైతం చేశారు

మరింత సమాచారం తెలుసుకోండి: