రాజధాని బిల్లు అసెంబ్లీ ఉభయసభల్లో పాసైపోయింది. సీఆర్ డీఏ కు చట్టబద్దత లభించింది. అందుకే ఇక చంద్రబాబు రాజధాని భూసేకరణపై దృష్టిసారిస్తున్నారు. ప్రభుత్వం భూసేకరణ విధానం ప్రకటించిన తర్వాత కూడా ఇంకా రాజధాని ప్రాంత రైతుల్లో ఇంకా కన్ఫ్యూజన్ తొలగిపోలేదు. కొందరు భూములిచ్చేందుకు రెడీ అంటే.. అబ్బే.. ఎట్టిపరిస్థితుల్లో ఇచ్చేది లేదని మరికొందరు తేల్చి చెబుతున్నారు. ఐతే.. మెజారిటీ ప్రాంత రైతులు ఇచ్చేందుకే సిద్ధంగా ఉన్నారట.                                        వ్యతిరేకించేవారి శాతం 30 కూడా దాటదని ఆ ప్రాంతంలోని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే ఈ మిగిలిన 30 శాతం మంది రైతులను ఒప్పించేందుకు బాబు ప్లాన్ రూపొందించారట. ప్రధానంగా నదీతీరంలోని గ్రామాలు, రహదారులకు ఆనుకుని ఉన్న గ్రామాలు, మూడు పంటలు పండే భూములున్న రైతులు వాటిని ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదు. ప్రభుత్వం తమకు ఏడాదికి ఇచ్చే 30వేలు, 50వేల జీవన భృతి ఎంతమాత్రం సరిపోదని వారంటున్నారు.                              అందుకే.. ముందు రైతుల్లోని అభద్రతా భావం పోగొట్టి.. భూసమీకరణ వల్ల కలిగే లాభాలు వారికి తెలిసివచ్చేలా అవగాహన కల్పించాలని ప్లాన్ చేస్తున్నారు. మామూలుగా చెబితే సాధారణంగా వినరు కాబట్టి.. బాబు కొత్త ఆలోచన చేశారు. అదే.. కుల పెద్దలతో చెప్పించే ప్రణాళిక. భూములిచ్చేందుకు ఒప్పుకోని గ్రామాల్లోని కులపెద్దలను గుర్తించి.. వారితో ప్ర్తత్యేకంగా మాట్లాడి.. వారిని ఒప్పించే పని చేస్తారట. కులపెద్దలు ఒప్పుకుంటే.. ఆటోమేటిగ్గా.. మిగిలినవారూ ఒప్పుకుంటారన్నది చంద్రబాబు ఐడియా. మరి ఈ ఐడియా ఏమేరకు వర్క్ అవుట్ అవుతుందో.. మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: