తెలుగుదేశం.. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పుకుంటున్న పార్టీ.. రెండు ప్రాంతాల్లోనూ ప్రజల కోసం పోరాడుచామని చెప్పుకుంటున్న పార్టీ.. రెండు ప్రాంతాల్లోనూ తమకున్నంత క్యాడర్ ఏ పార్టీకి లేదని చెప్పుకునే పార్టీ.. ఇన్నాళ్లూ ఈ మాటలు నిజమే కానీ..ఇప్పుడు ఆ సీన్ లేదు. ఆంధ్రాలో అదుర్స్ అంటున్న ఆ పార్టీ పరిస్థితి తెలంగాణలో మాత్రం నానాటికీ తీసికట్టుగా మారుతున్నాయి.                                       మంగళవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆ పార్టీ నేతలు వెల్లడించిన వివరాలే ఇందుకు అద్దం పడుతున్నాయి. 53 లక్షల మంది సభ్యులతో దేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీకి లేని ఘనత తెలుగుదేశం సాధించిందని ఆ పార్టీలు నేతలు చెప్పుకున్నది వాస్తవమే కావచ్చు.. కానీ ఆ మొత్తం సభ్యత్వంలో ఏ ప్రాంతంలో ఎన్ని సభ్యత్వాలో లెక్క తీస్తే మాత్రం అసలు డొల్లతనం బయటపడుతుంది. ఏపీలో తాజాగా 45 లక్షల మంది సభ్యత్వం నమోదు చేసుకున్నారు. అదే తెలంగాణలో మాత్రం కేవలం ఏడున్నర లక్షల మంది మాత్రమే సభ్యులుగా చేరారు.                     అంటే ఆంధ్రాలో పార్టీలో చేరిన వారితో పోల్చుకుంటే.. తెలంగాణలో అందులో ఆరోవంతు కూడా తెలంగాణలో నమోదు కాలేదు. అంటే తెలంగాణలో సభ్యత్వ నమోదుకు వచ్చిన స్పందన ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకిలా జరుగుతోంది. దీనికి తెలంగాణ టీడీపీ నేతలు కుంటిసాకులు చెబుతున్నారు. తెలంగాణలో ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోనే సభ్యత్వ నమోదు ఆశాజనకంగా ఉందట. ఈ మూడూ సరిహద్దు జిల్లాలే కావడం మరో విశేషం. అందుకే చినబాబు లోకేశ్.. అరకోటి సభ్యత్వం వచ్చిందని సంబరపడకుండా.. తెలంగాణలో ఎందుకు తగ్గిందో.. మెరుగుపరిచేందుకు ఏం చేయాలో ఆలోచిస్తే మేలు.

మరింత సమాచారం తెలుసుకోండి: