తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారంలోకి వచ్చి దాదాపు ఆరు నెలలు అవుతోంది. ఈ నేపథ్యంలో అవినీతి ఆరోపణల వాడి క్రమంగా పెరుగుతుండటం విశేషం. పచ్చదళం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ పార్టీ నేతలు, మంత్రులు దందాలు చేస్తున్నారని.. ఆక్రమణలకు, అక్రమాలకు పాల్పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే క్రమంగా వీటి వాడి పెరుగుతుండటం! ఆ మధ్య ఒక మంత్రిగారికి గ్రానైట్ మాఫియాఅంతా కలిసి భారీ కానుక ఇవ్వడం వివాదంగా మారింది. వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకొన్నందుకే మంత్రిగారికి ఆ భారీ కానుక అందిందని వార్తలు వచ్చాయి. సన్మానం చేసి మరీ బహిరంగంగా కానుక ఇవ్వడంతో వివాదం వార్తల్లోకి వచ్చింది. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆ మంత్రిగారి నుంచి వివరణ కోరినట్టు సమాచారం. ఆ సంగతి అలా ఉంటే.. ఇప్పుడు మళ్లీ మరో మంత్రిగారు ఇబ్బందుల్లో పడ్డారు. ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న యనమల రామకృష్ణుడి కుటుంబంపై ఈ సారి ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీ హోదాలో యనమల మంత్రిగా ఉండగా.. ఆయన తమ్ముడు మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. అయితే ఇప్పుడు ఆయన లోకల్ గా దందాలు చేస్తున్నాడని, అక్రమణలకు పాల్పడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. తీవ్రమైన ఆరోపణలే వినిపిస్తున్నాయి. మరి మంత్రిగారి తమ్ముడు ఇలా చేయడం మంత్రిగారికి, ఏపీ ప్రభుత్వానికి కూడా చెడ్డపేరే. మరి మాటెత్తితే తెలుగుదేశం వాళ్లు నిజాయితీ, నీతి అంటారు. ఇలాంటి వరస ఆరోపణలకుఏం సమాధానం చెబుతారు?!

మరింత సమాచారం తెలుసుకోండి: