తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన తనయుడికి కొత్త బాధ్యతలను అప్పజెప్పనున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు కేటీఆర్ ను తెలంగాణ రాష్ట్రసమితి అధినేతగా ప్రమోట్ చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం మంత్రిగా ఉన్న కేటీఆర్ చేత ఆ పదవికి రాజీనామా చేయించి మరీ పార్టీ ఆపరేషన్లను కేటీఆర్ కు అప్పజెప్పనున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. కేసీఆర్ కు, కేటీఆర్ లకు విబేధాలున్నాయన్నట్టుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. క్యాబినెట్ సమావేశాలకు కేటీఆర్ హాజరు కాకపోవడం... క్యాబినెట్ విస్తరణ సమయంలో ప్రమాణ స్వీకారానికి కూడా కేటీఆర్ హాజరు కాకపోవడం.. . ఆసక్తిని రేపింది. తండ్రి కేసీఆర్ పై కేటీఆర్ అసంతృప్తిలో ఉన్నాడనే అభిప్రాయాలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కానున్నాడని అంటున్నారు. మరి కేటీఆర్ కు పార్టీ బాధ్యతలను అప్పజెప్పితే... పార్టీలో ఎలాంటి పరిణామాలు మొదలవుతాయనేది కూడా ఆసక్తికరమైన అంశమే. కేసీఆర్ తన తనయుడిని పార్టీ అధినేత స్థానంలో కూర్చోబెడితే.. అది సంచలనమే అవుతుంది. అప్పడు హరీష్ రావు లాంటి వారి పరిస్థితి ఏమిటో!

మరింత సమాచారం తెలుసుకోండి: