ఎమ్మెల్యేలకు తిరుమల,తిరుపతి దేవస్థానం భలే కండిషన్ పెట్టింది.కొత్త సంవత్సర వేడుకలు, వైకుంఠ ఏకాదశి సందర్బంగా వచ్చే రద్దీని తట్టుకునేందుకు అదికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి ఒకటి,రెండో తేదీలలో స్వామివారిని సందర్శించే విఐపిలలో ఈసారి మొదట వచ్చేవారికి మొదట క్రమం ప్రాదాన్యత ఇస్తున్నట్లు జెఇఓ శ్రీనివాస రాజు చెప్పారు.మంత్రులు,ఎమ్.పిలు, ఎమ్మెల్యేలకు అవసరమైన వసతి ఏర్పాట్లు చేస్తున్నామని, అయితే మొదట వచ్చేవారికి ప్రాధాన్యం ఇస్తామని ఆయన అంటున్నారు.ద్వాదశి దర్శనం కోసం పదివేల టిక్కెట్లను అమ్మకానికి పెట్టినట్లు కూడా ఆయన చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: