క్రిస్టియానిటీ లేదా మరో మతం తీసుకొన్న దళితులకు రిజర్వేషన్లు వర్తింపజేయడం అనేది దేశంలో చాలా రోజులుగా ఉన్న వివాదమే. మిషనరీలు, ఇత మత సంస్థలు ప్రలోభ పెట్టి అనేక మందిని మతం మారుస్తున్నాయని.. ఇలాంటి వారు మిషనరీల లెక్కలో క్రైస్తవులుగా, ప్రభుత్వం లెక్కలో దళితులుగా చెలామణి అవుతూ రిజర్వేషన్లను పొందుతున్నారు. అయితే ఇలా మతం మారిన వారికి రిజర్వేషన్లు ఎందుకనేది ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం అయితే ఇలాంటి వారికి రిజర్వేషన్లు కల్పించడానికి అనుకూలంగా లేదు. ఒకవైపు మత మార్పిడిల రగడజరుగుతున్న విషయంలో దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు ఇవ్వడానికి తాము అనుకూలం కాదని భారతీయ జనతా పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది. మొత్తంగా దేశంలో మత మార్పిడిలనే నిషేధించాలని కూడా భారతీయ జనతా పార్టీ కోరుకొంటోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భిన్నమైన నిర్ణయాన్ని తీసుకొంది. కచ్చితంగా భారతీయ జనతా పార్టీ తీరుకు తెరాస ప్రభుత్వం విరుద్ధమైన నిర్ణయాన్ని తీసుకొంది. దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుకూలమైన విధానాన్ని అవలంభించనున్నట్టుగాప్రకటించింది. మతం మారిన దళితులకు కూడా రిజర్వేషన్లను వర్తింపజేస్తామని ఇక్కడి ప్రభుత్వం ప్రకటించింది. మరి ఇలాంటి ప్రోత్సహకాలు మతమార్పిడిలకు అనుకూలం అనేది కొంతమంది వాదన. తెలంగాన ప్రభుత్వ తీరు మత మార్పిడిలకు అనుకూలంగా నిలుస్తుందని వారు అంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విధంగా మత మార్పిడిలను ప్రోత్సహిస్తున్నాడని వారు అభిప్రాయపడుతున్నారు! ఈ విషయం గురించి ప్రభుత్వం ఏమనుకొంటోందో మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: