బీఎస్పీకి పార్టీకి కొత్త ప్రాబ్లమ్ వచ్చిపడింది. జాతీయ పార్టీగా ఇన్నాళ్లు కేంద్రంలో కీలకపాత్ర పోషించిన బహుజన్ సమాజ్ వాదీ పార్టీ నేషనల్ స్టేటస్ కొల్పోయే ప్రమాదం ఉంది. తాజా ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ గెలిచిన సందర్భాలు తక్కువే. దీంతో ఆ పార్టీ నేషనల్ స్టేటస్ విషయం డేంజర్ లో పడింది. వరుస ఎన్నికల్లో ఓడిపోవడంతో పాటు మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. తాజా జమ్మూలో కూడా ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. జార్ఖండ్ లో ఒక్క సీటు గెలిచింది. కనీసం మూడు సీట్లు గెలవాల్సిన పరిస్థితుల్లో ఒక్క సీటే గెల్చింది. రెండు రాష్ట్రాల్లో ఎనిమిది శాతం గెలవాల్సిన బీఎస్పీ… కశ్మీర్ లో 1.4 శాతం, జార్ఖండ్ లో 1.8 ఓట్ల శాతాన్ని పొందింది. దీంతో బీఎస్పీకి నేషనల్ స్టేటస్ తొలగించేందుకు సిద్ధమవుతోంది ఎలక్షన్ కమిషన్. ఒక వేళ బీఎస్పీ నేషనల్ స్టేటస్ కోల్పోతే… దూరదర్శన్, ఆలిండియా రేడియోల్లో పార్టీ సింబల్ వాడుకునే అవకాశముండదు. అంటే ఎప్పటి నుంచో ఆ పార్టీని అంటిపెట్టుకున్న ఏనుగు ఇక దూరమవబోతోంది. అయితే నేషనల్ స్టేటస్ పై మరో అవకాశం ఇవ్వాలని ఎన్నికల కమిషన్ను బీఎస్పీ కోరనున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: