కృష్ణా పరివాహన ప్రాంతంలో రబీకి నీటి విడుదలపై ఆంధ్రా తెలంగాణ.. రెండూ ఓ అంగీకారానికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ వివాదం పరిష్కరించాల్సిన నదీయాజమాన్యబోర్డు కూడా రెండు రాష్ట్రాల మొండివాదనలతో జుట్టుపీక్కుంటోంది. తానేమీ చేయలేనని చేతులు ఎత్తేస్తోంది. మరి ఈ బోర్డు ఎందుకున్నట్టు.. ఎందుకు సమస్య పరిష్కరించలేకపోతోంది.. కారణాలేంటంటే... రెండు రెండు రాష్ట్రాలు కూడా కృష్ణా నీటికి సంబంధించిన లెక్కలు ఎవరికి అనుకూలంగా వారు చూపుతున్నారు.                                                                           రెండు రాష్ట్రాలు అందించిన నివేదికలు పరిశీలించిన బోర్డు.. ఎవరి లెక్కలు వారు చెబుతున్నారని మండిపడింది. ఈ లెక్కలకు పొంతన ఉండటం లేదని బోర్డు స్పష్టంచేసింది. ఆ విషయం తెలుపుతూ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు... లేఖలు రాసింది. ఆంధ్రా, తెలంగాణ.. రెండు రాష్ట్రాలు అందచేసిన సమాచారం ప్రకారం ప్రతిపాదిత నీటి కేటాయింపులకూ వాస్తవ వినియోగానికీ చాలా తేడా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో నిబంధనల ప్రకారం రెండు రాష్ట్రాలకు సమన్యాయంగా కేటాయింపులు చేపట్టలేమని బోర్డు స్పష్టం చేసింది. రెండు 2 రాష్ట్రాల ప్రతినిధులు చర్చించుకుని.. వివరాలు పరిశీలించాలని కోరినా ఏమాత్రం ఉపయోగం ఉండటం లేదు.                                                    కృష్ణాబోర్డుకు నివేదికలు పంపేటప్పుడు రెండు రాష్ట్ర్రాలు నిబంధనలు పాటించడం లేదట. సరైన లెక్కలు పంపించడం లేదు కాబట్టి.. రబీకి నీరు విడుదల చేయాలావద్దా అనే అంశంపై తాము నిర్ణయం తీసుకోలేమని బోర్టు చెప్పేసింది. బోర్డు ఎటూ తేల్చకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. బోర్డు నిర్ణయం కోసం వేచి చూడకుండా నాగార్జునసాగర్‌ నుంచి నీరు విడుదల చేసుకుందామనే ఆలోచనలో ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: