ప్రతిపక్షం లో ఉన్నన్ని రోజులూ తెలుగుదేశం పార్టీ కి ఎన్నో సార్లు ఎన్టీఆర్ గొప్పదనం గుర్తొచ్చింది. ఆయన భారతరత్న అవార్డుకు అర్హుడనిపించింది. దుష్ట కాంగ్రెస్ వాళ్లు ఎన్టీఆర్ కు భారతరత్న అవరా్డును ఇవ్వడం లేదని... తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా అనేక సార్లుఅసంతృప్తి వ్యక్తం చేశాడు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలాంటి ఆందోళన వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ తీరా తమకు, తమ మిత్రపక్షం భారతీయ జనతా పార్టీకి అధికారం అందే సరికి మాత్రం ఎన్టీఆర్ ను మరిచిపోయింది. ప్రత్యేకించి భారతరత్న అవార్డు విషయంలో ఎన్టీఆర్ పేరును సిఫార్సు చేయలేదు, ఆ అవార్డులను ప్రకటించినప్పుడు కూడా ఎన్టీఆర్ పేరు ప్రస్తావించడం లేదు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వమే కొంచెం బెటర్. తమ ప్రాంతానికి చెందిన పీవీకి భారతరత్న అవార్డు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రసమితి వాళ్లు సిఫార్సు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఆ అవార్డును ప్రకటించకపోయే సరికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం వాజ్ పేయి, మాలవీయలకు భారతరత్న అవార్డు దక్కడం పై ఆనందం వ్యక్తం చేసి అంతటితో ఊరుకొండిపోయారు. మాటకైనా ఎన్టీఆర్ పేరును గుర్తు చేయలేదు!బహుశా మళ్లీ ప్రతిపక్షంలోకి వెళ్లే సరికి గుర్లు చేస్తారేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: