నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చివరకు మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించాడు. తనను అకారణంగా కేసుల్లో ఇరికించారని.. వాటిచిక్కుల నుంచి తనకు విముక్తిని కల్గించాలని ఈయన హ్యూమన్ రైట్స్ కమిషన్ కు మొరపెట్టుకొన్నాడు. చట్టపరంగా తనపై రౌడీషీట్ తెరవడం అనేది న్యాయం కాదని భూమా చెబుతున్నాడు. పోలీసులు తనను కావాలని కేసుల్లో ఇరికించారని అంటున్నాడు. ఇది వరకూ అసెంబ్లీలో సభా హక్కుల కమిటీకి కూడా భూమా నాగిరెడ్డి తన కేసుల విషయం గురించి చెప్పుకొన్నాడు. ఒక ఎమ్మెల్యే అయిన తన హక్కులకు పోలీసులే భంగం వాటిల్లేలా చేస్తున్నారని భూమా సభలో చెప్పాడు. అయితే సభా హక్కుల సంఘం నుంచి పోలీసులకు ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరాలూ వెళ్లలేదు. ఈ నేపథ్యంలో భూమా మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించాడు. మామూలుగా ఒక సంఘటనపై ఒకే కేసును నమోదు చేయాల్సి ఉంటుందని.. అయితే పోలీసులు తన విషయంలో ఈ చట్టాన్ని అతిక్రమించారని భూమా అంటున్నాడు. మున్సిపల్ సమావేశంలోజరిగిన గొడవ గురించి తనపై మూడు కేసులు నమోదు చేయడమే గాక... రౌడీషీట్ కూతా తెరిచారని.. ఇది సబబు కాదని ఆయన వాదిస్తున్నాడు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని..తన హక్కులకు భంగం కలగకుండా చూడాలని ఈయన హ్యూమన్ రైట్స్ కమిషన్ కు మొరపెట్టుకొన్నాడు. మరి అసెంబ్లీలో ఈయన గోడును పట్టించుకొన్న వారు ఎవరూ లేరు. మానవహక్కుల సంఘం ఎలా స్పందిస్తుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: