ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేసిన వ్యాఖ్యలు అసంబద్ధంగా ఉన్నాయి. రైతు రుణమాఫీ వ్యవహారం గురించి ఈయన స్పందిస్తూ రైతులకు చేసిన సూచన ప్రజాస్వామ్య యుతంగా లేదు. రుణమాఫీ వ్యవహారంలో తనకు రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో వ్యవసాయశాక మంత్రి బ్యాంకులకు తలుపులు వేయాలని సూచిస్తున్నాడు. సమాచారం విషయంలో సహకరించకపోతే బ్యాంకర్లపై తిరగబడాలని.. బ్యాంకులకు తలుపులు వేయాలని పుల్లారావు వ్యాఖ్యానించారు. మరి ఒక మంత్రిగారు ఇలా సూచించడం విడ్డూరమే. చట్టబద్ధంగా నడిచే వ్యవస్థలపై తిరగబడమని ఏ ప్రతిపక్షం వారో చెబితే.. ఏదోలే అనుకోవచ్చు. అయితే స్వయంగా మంత్రి పదవిలో ఉన్న ఒక వ్యక్తి ఇలా చెప్పడం విడ్డూరం అవుతుంది. బహుశా.. రైతులనుంచి వస్తున్న ఫోన్లను భరించలేక మంత్రిగారు ఇలా మాట్లాడారేమో. ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మంత్రిగారి ఫోన్ నంబర్ ను మీడియా ద్వారా రైతులకు ఇచ్చాడు. రుణమాఫీ వ్యవహారం గురించి సందేహాలను మంత్రిగారికే ఫోన్ చేసి తెలుసుకోవాలని రఘువీరారెడ్డి చెప్పాడు. అప్పటి నుంచి మంత్రిగారి ఫోన్ కు తీరిక లేకుండా కాల్స్ రావడం సహజమే. ఈ నేపథ్యంలో చిర్రెత్తుకొచ్చిన మంత్రిగారు తన కోపాన్ని ఎవరి మీద చూపాలో అర్థంగాక బ్యాంకర్ల మీద చూపినట్టుగా ఉన్నాడు. బ్యాంకర్లపై తిరగబడాలని రైతులకు సూచించినట్టుగా ఉన్నాడు. అయితే ఇది సమంజసమైన మాట కాదు!

మరింత సమాచారం తెలుసుకోండి: