మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న'రొమాంటిక్' బాబాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అతనికి కోర్టు వచ్చే నెల 7వ తేదీ వరకు రిమాండ్ విధించింది. అయితే స్వామిజీ వేషంలో ఉన్న వ్యక్తికి మతిస్థిమితం సరిగాలేదన్న కారణంతో.... వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు తిరిగి ఎర్రగుంట్లకు తీసుకెళ్లారు. స్వామిజీ వేషంలో ఉన్న వ్యక్తి వద్ద సుబ్బారెడ్డితోపాటు మరో ఇద్దరు...స్వామీజీని నమ్ముకుంటే ఎలాంటి సమస్యలున్నా తీరుతాయని, పిల్లలు లేనివారికి సంతానం కలుగుతుందని, స్వామి వద్దకు వస్తే దెయ్యాలు పోతాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దాంతో తన వద్దకు వచ్చిన మహిళల పట్ల స్వామిజీ వేషంలో ఉన్న వ్యక్తి వెకిలిగా ప్రవర్తించేవాడు. ఇటీవల అయ్యప్పస్వామి దేవాలయంలో జరిగిన లక్షార్చన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న చాలా మంది... స్వామీజీ వేషంలో ఉన్న మతిస్థిమితం లేని వ్యక్తిని చూసి ప్రలోభాలకు గురయ్యారు. స్వామీజీ వేషంలో ఉన్న వ్యక్తిని కోర్టు తిరిగి పోలీసులకు అప్పగించడంతో... పోలీసులకు తిప్పలు తప్పలేదు. అతన్ని పోలీస్ స్టేషన్‌లో పెట్టుకోవడం కష్టంగా మారింది. ఏ క్షణంలో అతను ఏం చేస్తాడో తెలియని పరిస్థితుల్లో పోలీసులు కాపలాగా సిబ్బందిని ఉంచి పర్యవేక్షిస్తున్నారు. గురువారం క్రిస్మస్ కావటంతో కడప రిమ్స్ కు తరలించినా అక్కడ వైద్యులు అందుబాటులో ఉండకపోవచ్చని పోలీసులు అప్పటివరకూ స్టేషన్ లోనే ఉంచే అవకాశం ఉంది. మరోవైపు మూఢ విశ్వాసాల కారణంగా ప్రజల నకిలీ బాబాలను ఆశ్రయించటంపై విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: