ఎపిలో వైఎస్ ఆర్.కాంగ్రెస్ నుంచి అదికార టిడిపిలో చేరడానికి సుమారు అరడజను మంది ఎమ్మెల్యేలు చర్చలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంద్ర నుంచి ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ఒకరు, నెల్లూరు,కర్నూలు జిల్లాల నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యే టిడిపిలో చేరవచ్చని అంటున్నారు.దీనిపై కొన్ని పత్రికలలో కదనాలు ఇప్పటికే వచ్చాయి.అయితే ఈ ఎమ్మెల్యేల విషయంలో స్థానికంగా ఉన్న టిడిపి నేతలు, మంత్రులు లేదా ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారని,వారిని సర్దుబాటు చేసే పనిలో నాయకత్వం ఉందని అంటున్నారు.ఉదాహరణకు ప్రకాశం జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే రాకుండా సీనియర్ నేత కరణం బలరామ్ అడ్డుకుంటున్నారట.దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేసి సర్దిచెప్పారని అంటున్నారు.అలాగే కర్నూలులో ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తికి నచ్చచెప్పారని అంటున్నారు.కాగా కొణతాల వర్గం టిడిపిలోకి రావడాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ,అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవిందరావు వ్యతిరేకిస్తున్నారు.వారికి కూడా చంద్రబాబు సర్ది చెప్పి క్లియరెన్స్ ఇచ్చారని అంటున్నారు.వచ్చే కొద్ది వారాలలో కొందరు ఎమ్మెల్యేలు టిడిపిలోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: