ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే అంటాడు రజినీకాంత్.. సీబీఐదీ అదే పంథా.. ఒక్కసారి కేసు పెడితే.. దాన్ని వందేళ్ల దాకా తవ్వుతూనే ఉంటుంది. అయ్య అధికారాన్ని అడ్డుపెట్టుకున్న వేల కోట్లు వెనకేసుకున్నాడంటూ జగన్ పై పెట్టిన కేసులను సీబీఐ దర్యాప్తు చేసిన సంగతి తెలిసిందే. ఆ దర్యాప్తు కూడా పూర్తయింది. అప్పట్లో మొత్తం వివరాలు కోర్టుకు అప్పగించి.. సీబీఐ చేతులు దులిపేసుకుంది. హమ్మయ్య్ ఓ పనైపోయిందని జగన్ కూడా ఊపిరిపీల్చుకున్నాడు. మొత్తం పదికి పైగా చార్జ్ షీట్లు జగన్ పై వేసింది సీబీఐ. వాటి విషయంలో కోర్టులో వాదనలు సాగుతూనే ఉన్నాయి. ఈ దశలో అక్రమాస్తుల కేసును సీబీఐ మళ్లీ తిరగదోడాలనుకుంటోందట. జగన్ కు చెందిన జగతి సంస్థలోకి బ్రీఫ్ కేసు కంపెనీల పెట్టుబడుల వెనక మర్మం తెలుసుకొనేందుకే ఈ స్టెప్ వేస్తోందట సీబీఐ. గతంలోనూ బ్రీఫ్ కేసు కంపెనీల పెట్టుబడుల విషయంలో అనేక ఉల్లంఘనలు జరిగాయని సీబీఐ చెప్పినా.. వాటిలో క్విడ్ ప్రొ కో ఆధారాలు దానికి కనిపించలేదు. అందుకే.. ఈ వివరాలు ఈడీకి, ఆదాయపన్ను శాఖకు పంపేసి సీబీఐ చేతులు కట్టుకుంది. ఐతే.. వేరే కేసుల విచారణలో ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు కొన్ని లేటెస్టుగా దొరికాయట.                             కొత్త ఆధారాల ఆధారంగా మళ్లీ కేసును తిరగదోడి.. జగన్ ను దోషిగా నిరూపించాలని సీబీఐ ఆలోచిస్తోందట. జగన్ కంపెనీల్లో కోల్ కతా, ముంబయి, బెంగళూరు, రాజ్ కోట్ కి చెందిన 20కు పైగా కంపెనీలు పెట్టుబడులు పెట్టాయట. దాదాపు 200 కోట్ల వరకూ ఈ మొత్తం ఉంటుందట. ఈ విషయాలను కోల్ కతాకు చెందిన ఓ టాక్స్ కన్సల్టెంట్ వాంగ్మూలం ఇచ్చాడట. ఇప్పుడు దాని ఆధారంగా జగన్ కంపెనీల గుట్టులాగాలని సీబీఐ ట్రై చేస్తోంది. ఈ బ్రీఫ్ కేసు కంపెనీల్లో చాలావరకూ తానే క్రియేట్ చేశానని కూడా ఆ కన్సల్టెంట్ చెప్పాడట. మరి సరైన ఆధారాలు దొరికితే.. వీటన్నింటితో మరో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని సీబీఐ ఆలోచిస్తోంది. సో.. జగన్ కు కేసులు ముప్పు పొంచిఉన్నట్టే..

మరింత సమాచారం తెలుసుకోండి: