భూమిని నమ్మినవాడెప్పుడూ చెడిపోడన్నది ఓ నానుడి. వ్యవసాయానికే కాదు.. రియల్ ఎస్టేట్ వ్యాపారానికీ ఇది వర్తిస్తుంది. కాకపోతే.. స్పెక్యులేషన్ ఆధారంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తే మాత్రం రిస్క్ చాలా ఎక్కువే. అందుకు ఏపీ రాజధాని ప్రాంతమే ఓ ఉదాహణ. నెలల క్రితం వరకూ ఎకరం 5 నుంచి 10 లక్షలు ఉండే ఇక్కడ భూమి.. రాజధాని వార్తల పుణ్యమా అని ఏకంగా కోట్లు పలికేసింది. రోజుకో రేటు పలుకుతూ శరవేగంగా దూసుకుపోయింది. కేపిటల్ వస్తే.. ఈ ప్రాంతం కూడా హైదరాబాద్, బెంగళూరు రేంజ్ కు వెళ్లుందన్న అంచనాలే అందుకు కారణం.                                     ఐతే.. ఇప్పుడు రాజధాని భూసమీకరణ విధానం, రాజధాని బిల్లు ఆమోదం నేపథ్యంలో.. రాజధాని ప్రాంతంలో భూమ్ ఒక్కసారిగా తగ్గిందట. సర్కారు ప్రకటించిన భూసమీకరణ ప్యాకేజీ వివరాలే అందుకు కారణమంట. తాము ఇప్పుడు భూమి కొంటే ఎంత పెట్టుబడి అవుతుంది. రేపు ఆ భూమిని సర్కారు సేకరిస్తే.. ఎంత ఇస్తుంది. గరిష్టంగా ఎంత లాభం వస్తుంది.. అని లెక్కలేసుకున్న రియల్టర్లు.. ఇప్పుడు భూమి కొనుక్కోవడం అంత సేఫ్ కాదని ఆలోచిస్తున్నారట.                                  కోటి రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టిన తర్వాత.. దాన్ని సర్కారు సమీకరణ కింద తీసుకుని కేవలం 1200 గజాలు అప్పగిస్తే.. అది ఎంత హైరేంజ్ లో రేటు పలికినా.. పెట్టిన కోటి రూపాయలకు, వడ్డీ కలుపుకుంటే వచ్చే మొత్తానికి సరిపోలడం లేదట. అందులోనూ అంత మొత్తం భూమి మీద పెట్టుబడి పెట్టి.. సర్కారు నిర్ణయాల కోసం ఎదురుచూడటం కంటే.. అదే మొత్తం వేరే చోట పెట్టడం బెటరని అనుకుంటున్నారు.                                     ప్రభుతం భూసేకరణ అయ్యాక.. డెవలప్ మెంట్ చేసి రైతులకు ఇచ్చిన భూమి కొనుక్కుంటే బెటరనుకుంటున్న మరికొందరి రియల్డర్లు.. అందుకు కొన్నాళ్లు సమయం పట్టే అవకాశం ఉండటంతో.. వెయిట్ అండ్ సీ పాలసీ అమలు చేస్తున్నారట. అందుకే గత నెలలో రాజధాని ప్రాంతంలో 40 శాతం వరకూ రిజిస్ట్రేషన్లు పడిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: