చంద్రబాబు తర్వాత టీడీపీ అధినేత ఎవరవుతారు.. ఈ ప్రశ్నకు చిన్నపిల్లవాడు కూడా లోకేశ్ అనే సమాధానం చెబుతారు. ఐతే అందుకు చాలా సమయం ఉందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత.. కార్యకర్తల సంక్షేమనిధి కన్వీనర్ అనే పోస్టు అప్పగించి ముందు పార్టీపై పట్టు పెంచుకో అని బాబు చిన్నబాబును వదిలేశారు. ఆయన కూడా స్టెప్ బై స్టెప్ మెట్లుక్కుదామని ఆ బాధ్యతలు స్వీకరించాడు. అంతవరకూ సీన్ బాగానే ఉంది.                కానీ పార్టీ వ్యవహారాల వరకూ మాత్రమే పరిమితమైపోతే.. ఇబ్బందని ఇప్పుడు చినబాబు ఫీలవుతున్నాడట. అందులోనూ అధికారంలో ఉన్న పార్టీ కదా.. అందుకే మంత్రులపై పెత్తనం చెలాయించేందుకు లోకేశ్ ప్రయత్నిస్తున్నాడని సమాచారం. ప్రతిపక్షంలో ఉన్న కారణంగా గత పదేళ్లూ.. టీడీపీ నేతలు ఎక్కువగా పార్టీ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతూ గడిపేశారు. ఇప్పుడు వారిలో చాలామంది మంత్రులైపోయారు. మంత్రులయ్యాక వారికి ఎన్టీఆర్ భవన్ వైపు తిరిగి చూసేందుకు ఏమాత్రం తీరడం లేదట.                 అందులోనూ రాజూ బంటూ తనే అనే టైపులో పార్టీ పనంతా తన నెత్తిన పడిందని చినబాబు అప్పుడే ఫీలైపోతున్నారట. అందుకే.. తనకు సహాయంగా.. మంత్రులు కూడా పార్టీ వ్యవహారాల్లో పాలుపంచుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారు. దీని ఫలితంగా కొత్త ఏడాది నుంచి రోజూ ఎవరో ఒక మంత్రి ఎన్టీఆర్ భవన్లో కచ్చితంగా ఉండాల్సిందేనని రూల్ పాస్ చేయిస్తున్నారు. ఆ మేరకు చంద్రబాబు దగ్గర కండీషన్ ఓకే చేయించారట. దీంతో.. అసలే మంత్రి బాధ్యతలతో సతమతమవుతుంటే.. ఇదెక్కడి బాధ్యతరా బాబూ అని మంత్రులు గొణుక్కుంటున్నారు. కానీ ఏం లాభం.. చినబాబు చెప్పాక తప్పుతుందా..!

మరింత సమాచారం తెలుసుకోండి: