డబ్బు లు ఖర్చు పెట్టి హామీలు అమలు చేయడం సంగతి ఎలా ఉన్నా.. కనీసం విధానపరమైన వ్యవహారాల్లోనైనా బాబు ప్రభుత్వం సక్సెస్అవుతోందా.. అంటే అదేమీ లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ వంటి వ్యవహారాల్లో ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదనే అపప్రదలను మూటగట్టుకొంది. వాటి సంగతి అలా ఉంటే.. ఎన్నికల ముందు తెలుగుదేశం వాళ్లు ఇసుక వ్యవహారం గురించి కూడా గట్టిగా మాట్లాడారు. ఇసుక యాజమాన్యానాన్ని డ్వాక్రా మహిళలకు అప్పజెప్పుతామని, ఎక్కడిక్కడ ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల ఇసుక మాఫియాకు అడ్డుకట్ట పడుతుందని బాబు చెప్పుకొచ్చారు. మరి అధికారం చేతికందింది కదా.. ఈ విధానాన్ని అమలు చేస్తున్నారా.. అంటే అదేమీ లేదు! ఎక్కడో పేరుకు ఒకటీ రెండు చోట్ల మాత్రమే ఇసుక యాజమాన్యాన్ని డ్వాక్రామహిళల చేతికి అప్పగించారు. అది కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే వారి కుటుంబాలకు చెందిన సంఘాలకే అప్పగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ డ్వాక్రా సంఘాలను అడ్డం పెట్టుకొని తెలుగుదేశం నేతలే ఇసుకు మాఫియాగా ఏర్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓవరాల్ ఇసుక విషయంలో చెప్పిన విధానాలను అమల్లో పెట్టడం లేదు చంద్రబాబు ప్రభుత్వం. అమలు పెట్టినా అవి తెలుగుదేశం కార్యకర్తలకు సిరులు పండిస్తున్నాయంతే. బాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరునెలలు గడిచినా ఇప్పటి వరకూ ఇసుకధరలు తగ్గింది కానీ, మాఫియా ఆగడాలు తగ్గింది కానీ లేదు. ఇదీ కథ!

మరింత సమాచారం తెలుసుకోండి: