తను చాయ్ వాలాని అని చెప్పుకొంటాడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఈ మేరకు ఆయన ఎన్నికల ముందు అలా చెప్పుకొని బడుగుబలహీన వర్గాల నుంచి మద్దతు పొందాడు. గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. ఆయన చాయ్ వాలాని అని చెప్పుకొన్నాడు. ఇక భారతీయ జనతా పార్టీ వాళ్లు వ్యూహాత్మకంగా ప్రధాని చాయ్ వాలా ఇమేజ్ ను వాడుకొన్నారు. ఇలా భారతీయ జనతా పార్టీకి ఆ చాయ్ వాలా కలిసొస్తే.. తెలంగాణ కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఒక చాయ్ వాలాకు గొప్ప ప్రాధన్యత ను ఇచ్చింది. స్వయంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆ చాయ్ వాలా వద్దకు వెళ్లి మరీ సభ్యత్వాన్ని ఇచ్చి వచ్చాడు. ఇంతకీ ఆ చాయ్ వాలా ఎవరు.. ఆయనకు అంత ప్రాధాన్యత ఎందుకు.. అంటే ప్రత్యేక రీజన్లు ఏమి లేవు... హైదరాబాద్ కు చెందిన ఆ చాయ్ వాలా పొన్నాల లక్ష్మయ్య కు ఫోన్ చేసి తనకు పార్టీ సభ్యత్వకావాలని అడిగాడట. దీంతో పొన్నాల స్వయంగా ఆ చాయ్ వాలా ఇంటికి వెళ్లి పార్టీ సభ్యత్వాన్ని ఇచ్చి వచ్చాడట! ఇదీ కాంగ్రెస్ చాయ్ వాలా సంగతి. పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొనే పనిలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు చాయ్ వాలా ఇంటికి వెళ్లి ఈకార్యక్రమానికి ప్రచారాన్ని తెచ్చుకొనే ప్రయత్నం చేశాడు. మరి ఇలాంటి ప్రయత్నాలు కాంగ్రెస్ గతిని మార్చగలవా!

మరింత సమాచారం తెలుసుకోండి: