నేతలు కొడుకులు నేతలు.. నటుల కొడుకులు నటులు కావడం తెలుగు నేలకు కొత్తకాదు.. ఐతే.. కేవలం వారసత్వం ఒక్కటే ఈ రెండు రంగాల్లోనూ రాణించేందుకు సరిపోదన్న విషయాన్ని ఇప్పటికే చాలామంది రుజువు చేశారు. తెలుగు వారసత్వ రాజకీయాల్లో కేసీఆర్ అంత అదృష్టవంతుడు మరొకరు ఉండరనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఆయన కొడుకు, కూతురు, మేనల్లుడు.. ముగ్గురూ వారసత్వం ద్వారానే రాజకీయాల్లో అడుగుపెట్టినా క్రమంగా సొంత ఇమేజ్ సంపాదించుకున్నారు. ముగ్గురూ మంచి వాయిస్ ఉన్న వారే కావడం మరో విశేషం.                 ప్రత్యేకించి కేసీఆర్ కూతురు కవిత.. తండ్రి రూపురేఖలే కాదు.. రాజకీయాలూ పుణికిపుచ్చుకున్నట్టు కనిపిస్తున్నారు. తెలంగాణ జాగృతి పేరుతో సొంత సంస్థ పెట్టుకుని పాపులర్ అయిన ఈమె.. ఎన్నికలకు ముందు.. తెలుగు సినీరంగంలోని ప్రముఖులకు నిద్ర లేకుండా చేశారు. తెలంగాణ యాసను కించపరుస్తున్నారంటూ.. కొన్ని సినిమాల విడుదల విషయంలో అడ్డుపడ్డారు. ఎన్నికల తర్వాత ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది.                      తండ్రి ఏకంగా ముఖ్యమంత్రి కావడంతో.. ఒకప్పుడు ఉద్యమం, సంస్కృతి అంటూ క్లాసులు దంచే కవిత.. ఇప్పుడు అభివృద్ధి కబుర్లు చెబుతున్నారు. ఎంపీగా పార్లమెంటులోనూ అప్పుడప్పుడూ గొంతు సవరించుకునే కవిత లేటెస్టుగా సినీరంగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాల్ను సినీ షూటింగ్ కేంద్రాలుగా మారుస్తామన్నారు. హైదరాబాద్లో సినిమా షుటింగ్ చేసుకునే వారికి రాయితీలు ఇచ్చేలా తండ్రి కేసీఆర్ తో మాట్లాడతామని చెప్పారు. అంతేకాదండోయ్.. ఫిలిం సిటీ ఏర్పాటు కూడా శరవేంగంగా పూర్తి చేస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: