ఎపిలో శాసనమండలి స్థానాలను ఏభై నుంచి ఎభై ఎనిమిదికి పెంచడంతో పలువురు సీనియర్ నాయకులు, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి ఉన్న ప్రముఖులకు ఆశలు చిగురిస్తున్నాయి. ఎపి శాసనసభలో 175 సీట్లు ఉన్న నేపధ్యంలో అందులో మూడో వంతు వరకు శాసనమండలి సభ్యులు ఉండవచ్చు.దీని ప్రకారం మరో ఎనిమిది సీట్లు ఎపికి రాబోతున్నాయి. వీటిలో మెజార్టీ సీట్లు టిడిపికే దక్కుతాయి.సీనియర్ నేతలు గాలి ముద్దు కృష్ణమనాయుడు,పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు ఈసారి ఎమ్మెల్సీ సీట్ల విషయంలో ముందు స్థానంలో ఉన్నారని అంటున్నారు.వారితో పాటు పార్టీకి సేవలందించిన జయరామిరెడ్డి,టిడి జనార్ధన్, వివివి చౌదరి, కర్నూలు జిల్లా నేతలు ఎన్.ఎమ్.డి.ఫరూఖ్, సోమిశెట్టి వెంకటేశ్వర్లు కడప జిల్లాకు చెందిన పి.రామసుబ్బారెడ్డి, పుత్తా నరసింహారెడ్డి తదితరులు ఈ రేసులో ఉన్నారు.అలాగే పార్టీ ఆఫీస్ లో ఉండే ఎమ్.ఎ.షరీష్ వంటివారు కూడా ఈ పదవులకు పోటీ పడవచ్చు.మొత్తం మీద టిడిపిలో పలువురు నేతలకు పదవులు రాబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: