అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులే జరిగినా.. వైసీపీ అధినేత జగన్ కు కాస్తో కూస్తో మంచి పొలిటికల్ మైలేజీనే ఇచ్చాయి. రుణమాఫీ, రాజధాని వంటి అంశాలపై టీడీపీకి వైసీపీ నేతలు బాగానే కౌంటర్లు ఇచ్చారు. చివరకు చంద్రబాబు కూడా తన టీమ్ సరిగ్గా పనిచేయలేదని కోపంతో ఉన్నారు. ఇక క్రమంగా డోస్ పెంచుకుంటూ వెళ్దామని జగన్ భావిస్తున్న వేళ.. ఆయనకు మరికొన్నిచిక్కులు వచ్చిపడేలా ఉన్నాయి. పాత కేసులు తిరగదోడాలని సీబీఐ ప్లాన్ చేస్తుండటం కాస్త కలవరం కలిగిస్తోంది.                  ఈ నేపథ్యంలో టీడీపీ ఐటీశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి జగన్ తీరుపై లేటెస్టుగా విమర్శలు కురిపించారు. చంద్రబాబు విపరీతంగా కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటుంటే.. జగన్ అవగాహన లేకుండా ప్రవర్తిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో వైసీపీ వ్యవహరించిన తీరు.. ప్రత్యేకించి ప్రతిపక్షనాయకుడి ప్రవర్తనను ఆయన తప్పబట్టారు. అంతేకాదు.. అసలు జగన్ కాన్సంట్రేషన్ అంతా ఇప్పుడు సీబీఐ కేసులపైనే ఉందని కూడా విమర్శించారు.                  టీడీపీ నేతలు ఇలా విమర్శలు కురిపించడం ఇదేంకొత్త కాదు. మొన్న దేవినేని, రావెల వంటి వారు కూడా ఇదే టైపులో రెచ్చిపోయారు. కాకపోతే అసెంబ్లీ ముగిసిన నాలుగైదు రోజుల తర్వాత కూడా వారు ఇంకా అసెంబ్లీ అంశాలపైనే విమర్శించడం కాస్త ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకవేళ జగన్ దూకుడుతో వారు ఆత్మరక్షణలో పడ్డారేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. టీడీపీ నేతలు అన్నారని కాదు గానీ.. జగన్ వర్గీయులు కూడా సీబీఐ కేసుల విషయంలో కాస్త కంగారుగానే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: