ఒకవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటెత్తితే విదేశాల పేర్లు ప్రస్తావిస్తున్నాడు. ఏపీ రాజధాని విషయంలో సింగపూర్ ను రోల్ మోడల్ గా చూపుతున్నాడు. అద్భుతాలు సాధించేస్తామని అంటున్నాడు. ఈ విషయంలో బాబు ఎక్కడా తగ్గడం లేదు. ప్రత్యేక విమానం వేసుకొని విదేశాలకు వెళ్లడం విషయంలోనైనా... బారీ ఎత్తున రాజధాని నిర్మాణం చేపడతామని చెప్పడంలోనైనా.. బాబు ఒక రేంజ్ మాటలు మాట్లాడుతున్నాడు. అయితే వాస్తవం మాత్రం మరోరకంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. బాబు ఇలాంటి గాల్లో మేడలు కట్టే కబుర్లు చెబుతున్నా... వాస్తవంలో మాత్రం ఏపీకి అర్థిక వ్యవస్థకు అంత సీన్ లేదని స్పష్టం అవుతోంది. వివిధ పన్నుల రూపంలో వసూలు అవుతున్నా మొత్తానికి ఖర్చులకు సరిపోతోందని సమాచారం. ఇలాంటి ఖర్చులుకూడా అధికం అవుతుండటంతో మార్చి నెల వచ్చే సరికి ఆర్థిక వ్యవస్థ కు మరింత భారం పెరుగుతుందని సమాచారం. దీంతో ప్రస్తుతం నడుస్తున్న స్థాయిలో కూడా వ్యవస్థ నడవడం కష్టమని ప్రభుత్వంలో అర్థిక శాఖను చూసే పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్రం పై భారీ ఆశలే పెట్టుకొన్నా.. అందుకు తగ్గ ప్రయోజనం కనపడటంలేదు. మోడీ సర్కార్ ఏపీపై ప్రత్యేక దృష్టి ఏమీ పెట్టడం లేదని స్పష్టం అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఉన్న వ్యవస్థలే నడవడం కష్టమని ఆర్థిక శాఖ వాళ్లు అంటున్నారు. మరో రెండు మూడునెలల్లో నిధుల లేమితో ఏపీలో ఆర్థిక సంక్షోభం నెలకొన్నా ఆశ్చర్యపోవద్దని వారు వ్యాఖ్యానిస్తున్నారు. మరేం జరుగుతుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: