ఇప్పటికే పీజేఆర్ తనయ గులాబీదళంలో చేరిపోయింది. మొన్నటి వరకూ వైకాపాలో ఉండిన ఆమె టీఆర్ఎస్ లో చేరింది. ఇదిలా ఉంటే ఇప్పడు పీజేఆర్ తనయుడు కూడా టీఆర్ఎస్ బాటలో ఉన్నాడని తెలుస్తోంది. ఈయన త్వరలోనే గులాబీ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యాడు విష్ణువర్ధన్ రెడ్డి. చిన్న వయసులోనే మాజీ ఎమ్మెల్యేగా కూర్చోవడంతో విష్ణు బాగా ఫీలవుతున్నాడట. ఈ నేపథ్యంలో ఈయన కు టీఆర్ఎస్ వాళ్లు కూడా గాలం వేసినట్టుగా తెలుస్తోంది. తాజాగా విష్ణు వెళ్లి కేసీఆర్ తో సమావేశం అయ్యాడు. పీజేఆర్ వర్ధంతి కార్యక్రమానికి విష్ణు తెలంగాణ ముఖ్యమంత్రిని ఆహ్వానించాడు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ హాజరను కానున్నట్టు సమాచారం. అలాగే ఐమ్యాక్స్ ఎదురుగా ఉన్న పార్కుకి పీజేఆర్ పేరు పెట్టడం గురించి కూడా కేసీఆర్ సానుకూలంగా ఉన్నాడట. ఈ పరిణామాలు అన్నీ విష్ణును టీఆర్ఎస్ కు దగ్గర చేయనున్నాయని తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డితో గొడవ పడటం తో కూడా పార్టీలో విష్ణు ఇమేజ్ చెడిపోయింది. ఈ నేపథ్యంలో విష్ణు కాంగ్రెస్ కు రాజీనామా చేసే అవకాశాలు పెరిగాయి. మొత్తానికి పీజేఆర్ తనయుడుకూడా జంప్ అవుతాడేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: