హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు చెక్‌పెట్టారు. జూబ్లీహిల్స్ లో గత రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. వారి తనిఖీల్లో పెద్ద ఎత్తున బడాబాబులు పట్టుపడినట్లు సమాచారం. ఈ తనిఖీల్లో మొత్తం 18 మంది మద్యం తాగి బండి నడుపుతూ అడ్డంగా దొరికిపోయారు. ఈ సందర్భంగా 13 కార్లతో పాటు ఆరు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే పట్టుబడినవారి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచటం విశేషం. వీటిలో వీఐపీల కార్లు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా వారం రోజుల క్రితం ఓ సినీనటుడి బంధువు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన విషయం తెలిసిందే. మరోవైపు మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారికి చెక్ చెప్పేందుకు ఎల్బీనగర్, ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 9మందిపై కేసులు నమోదు చేసి నిన్న కోర్టులో హాజరు పరిచారు. మద్యం తాగి వాహనాలు నడిపిన ఒక్కొక్కరికి మేజిస్ట్రేట్ పుష్పాదేశ్ ముఖ్ రెండువేలు జరిమానా విధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: