తనలో మంచి వాక్పటిమ మాత్రమే కాదు... స్పాంటినియస్ గా జోకులేసే శక్తి కూడా ఉందని చాటుకొన్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. అక్కినేని జాతీయ పురస్కార ప్రధాన కార్యక్రమంలో కేసీఆర్ తన ప్రసంగాన్ని సరదాగా స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన వెంకయ్యనాయుడు, సుబ్బరామిరెడ్డిలను ప్రస్తావిస్తూ కేసీఆర్ ప్రసంగం మొదలైంది. ఈ కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడే సమయానికే వెంకయ్యనాయుడు, సుబ్బరామిరెడ్డిలు ప్రసంగించారు. ఆ తర్వాత మైకు కేసీఆర్ చేతికి వచ్చింది. తన ప్రసంగాన్ని మొదలుపెడుతూనే వెంకయ్య, సుబ్బరామిరెడ్డిల గురించి కేసీఆర్ ప్రస్తావించాడు. "వెంకయ్యనాయుడు గారి, సుబ్బారామిరెడ్డి గారి ప్రసంగాల తర్వాత నేను మాట్లాడితే లాఠీచార్జి తర్వాత చీపురుపుల్లతో కొట్టినట్టుగా ఉంటుంది...'' అని కేసీఆర్ వ్యాఖ్యానించాడు. దీంతో అందరూ భల్లున నవ్వారు. వెంకయ్య ప్రసంగంలో ప్రాసలు ఉంటాయని... సుబ్బరామిరెడ్డి సంస్కృతశ్లోకాలతో ప్రసంగాన్ని మొదలు పెడతారని.. వారి ప్రసంగాల తర్వాత తన ప్రసంగం ధాటిగా అనిపించదని కేసీఆర్ అభిప్రాయపడ్డాడు. ఈ విధంగా సుబ్బరామిరెడ్డి, వెంకయ్యల వాక్పటిమలను మెచ్చుకొంటూ కేసీఆర్ మాట్లాడటం సరదాగా అనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: