ప్రత్యేక తెలంగాణ కాంక్షతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇక్కడి ప్రజలు నిర్వహించిన భారీ ఉద్యమం... దానికి రాజకీయ నేతల సహకారం.. కాంగ్రెస్ వ్యూహంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మరి ఇలా ఏర్పడిన రాష్ట్రం తొలి బడ్జెట్ అగమ్యగోచరంగా... లొసుగుల పుట్టలా ఉందట. ఇలా అంటున్నది తెలంగాణ ఫ్రాంతానికి చెందిన నేతలే! తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడాడు. ప్రభుత్వం బడ్జెట్ లో చూపిన లెక్కలకు వాస్తవానికి ఏ మాత్రం సంబంధం లేదని షబ్బీర్ విరుచుకపడ్డాడు. కేసీఆర్ ప్రభుత్వం కొంచెం లేటుగా అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ మొత్తం విలువ లక్ష కోట్ల రూపాయలపైనే ఉంది. అయితే ఇప్పటి వరకూ పెట్టిన ఖర్చు 21 వేల కోట్ల రూపాయలు మాత్రమేనట. మరి లక్ష కోట్ల రూపాయల పై బడ్జెట్ అని చెప్పి ఇప్పటి వరకూ అందులో 20 శాతం నిధులను కూడా ఖర్చు పెట్టలేదు. 80 నిధుల గురించి క్లారిటీ లేదు. తీరా చూస్తే మరో మూడు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. మూడు నెలల్లో 80 వేల కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెడతారు.. ఆ నిధుల సమీకరణ మాటేంటి... అని షబ్బీర్ అలీ ప్రశ్నిస్తున్నాడు. మరి షబ్బీర్ లేవనెత్తిన పాయింట్ అయితే బాగానే ఉంది. ఈయనకు తెరాస ప్రభుత్వం సమాధానం చెబుతుందా?! లేక ఇలాంటి ప్రశ్నలను పట్టించుకోదా!

మరింత సమాచారం తెలుసుకోండి: