గ్రామాల అభివృద్ధికి స్మార్ట్ ఫోన్ అప్లికేషన్లు అంట... వాటిని అందరూ పోటీల పడి రూపొందించాలట.. వారికి బహుమతులు కూడా ఇస్తుందట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ విషయాలన్ని చెబుతున్నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సంక్రాంతి సందర్భంగా బాబు కొత్త పథకం ఒకదాని గురించి వివరించారు. కనుమ సందర్భంగా స్మార్ట్ గ్రామం అని బాబు తెలిపారు. క్యాబినెట్ మీటింగ్ లో బాబు ఈ విషయాలను ప్రకటించారు. గ్రామ కార్యదర్శకులకు ట్యాబ్లెట్ లు ఇస్తామని.. ఆ ట్యాబ్ ల ద్వారా గ్రామాభివృద్ధి గురించి ప్రణాళికలను చేరవేస్తామని బాబు చెబుతున్నారు. ఇలాంటి ప్రణాళికలను రూపొందించడానికి అందరి సహకారం కావాలని... పండగకు ఊరికొచ్చే వాళ్లంతా తమ తమ ఆలోచనలను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి చేరవేయాలని... బాబు కోరుతున్నారు. అలాగే స్మార్ట్ ఫోన్ అప్లికేషన్లను రూపొందించాలని.. వాటిలో ఉత్తమమైన వాటికి బహుమతులు కూడా ఇస్తామని బాబు చెబుతున్నాడు. మొత్తానికి ఏపీ అధ్యక్షుడు ఎవరికీ అంతుబట్టని రీతిలో స్మార్ట్ ఫోన్లు, అప్లికేషన్లు అంటూ ముందుకు పోతున్నాడు. అయితే జనాలు అయితే బాబు వేగాన్ని అందుకొనేలా లేరు. ఈ పరిస్థితి ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: