ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవటం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు రైతు ధర్నా పేరిట రాజకీయం చేస్తున్నారని సిఎల్ పి విమర్శించింది. అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయమే దండగ అన్న నాయకుడు నేడు రైతుపేరిట ధర్నా చేస్తూ మహారాజు సిటులో కూర్చోవటం విడ్డూరంగా ఉందని సిఎల్ పి ఉపనాయకులు వి.కిష్ఠారెడ్డి, శాసనమండలి సభ్యులు పొంగులేటి సుధాకరరెడ్డి అన్నారు. పార్టీపై పట్టుకోల్పోయి దిశదశలేని పరిస్థితుల్లో తన విశ్వసనీయతను కపాడుకోవటానికి రైతుల గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. సిఎల్ పి కార్యాలయంలో సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే కవల్సినంత విత్తనాలు, ఎరువులను పంపిణీ చేస్తుందని, అయితే రైతులు తీసుకున్న రుణాలను రీషెడ్యూల్ చేయాల్సి ఉందని, ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బ్యాంకర్లతో మాట్లాడాలని పొంగులేటి సుధాకరరెడ్డి చెప్పారు. కౌలు రైతులందరికీ వడ్డీలేని రుణాలను అందజేయాలని కూడ వారు కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: