ఆర్డినెన్స్-లతో ప్రభుత్వాన్ని నడుపుతారా అంటూ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తుతోంది. ప్రతి ఇరవై రోజులకు ఓ ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అగత్యం కేంద్రానికి ఎందుకు పట్టిందని కాంగ్రెస్ పార్టీ నిలదీస్తోంది. ఏడు నెలల్లో 10 ఆర్డినెన్స్-లు తీసుకురావడంపై పోరాటం చేయాలని సీడబ్ల్యూసీ భేటీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాల్లో కోతలు విధించడం, బ్రిటీష్ కాలం నాటి చట్టాలను మళ్లీ తేవడం వంటి పనులను బీజేపీ సర్కారు చేస్తోందని కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఇందుకు కేంద్రం అనుసరిస్తున్న విధానాలే కారణమని ఆరోపించింది. భారతీయ జనతా పార్టీ నేతలు పదేపదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నా ప్రధాని స్పందించకపోవడంతో బీజేపీ అజెండా ఏమిటో స్పష్టమవుతోందని కాంగ్రెస్ పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: