పవిత్ర పుణ్యశ్రీక్షేత్రం యాదగిరిగుట్టలో రాసలీలు జోరుగా సాగుతున్నాయి. దీనిపై దృష్టిసారించాల్సిన అధికార యంత్రాంగం అందినకాడికి పుచ్చుకుంటూ పవిత్రతను అవపవిత్రం చేయిస్తున్నారు. గతంలో యాదగిరి గుట్టలో బహిరంగంగా వ్యభిచారిణులు తిష్టవేసి విటులను ఆకర్షించేవారు. అయితే అప్పట్లో నల్గొండ ఎస్పీ ఆదేశానుసారం పోలీసులు వ్యభిచారుణులు గృహాలపై దాడులపై చేసి అక్కడి నుండి పంపించివేశారు. దీంతో అప్పట్లో పోలీసుల పనితీరుపై జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇదంతా మూణ్ణాళ్ల ముచ్చటే అన్న చందం మూడేళ్లుగా బాగానే ఉన్న గుట్ట పరిసర ప్రాంతాలు మళ్లీ కలుషితం అవుతున్నాయి. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట పుణ్యం క్షేత్రానికి ప్రతినిత్యం వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక మంచిరోజులు, పండుగలు వస్తే ఈ సంఖ్య వేలల్లో ఉంటుంది. స్వామి వారికి మొక్కులు తీర్చుకున్న అనంతరం పాత లక్ష్మీనరసింహాస్వామి దేవాలయానికి దర్శనం నిమిత్తం వెళుతుంటారు. ఇందులో కొందరు కాలి బాటన వెళుతుండగా మరికొందరు వాహనాల్లో వెళుతుంటారు. కాలిబాటన వెళ్ళేవారికే ఈ వ్యభిచారిణుల బాధ ఉంటుంది. ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామివారి దర్శనార్దం వెళ్లే భక్తులను వ్యభిచారిణులు తమ అపురూప సౌందర్యాలతో భక్తుల మదిని పెడదోవ పట్టిస్తున్నారు. రేటు కుదుర్చుకున్న అనంతరం పట్టణ పరిసర ప్రాంతాల్లోని నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్లి రాసలీలలు సాగిస్తున్నట్లు సమాచారం. కొంతమంది బ్రోకర్లు వీరికి మధ్య వర్తులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి యాదగిరి గుట్ట పవిత్రతను కాపాడాలని పలువురు భక్తులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: