గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించడం అంటే.. అది ఏ సాహసాలో చేసి, విన్యాసాలో చేసి గుర్తింపు సంపాదించడమే కాదు...ప్రభుత్వ విధి విధానాల ద్వారా కూడా ఈ రికార్డు పుస్తకంలో స్థానం సంపాదించవచ్చని రుజువు చేసింది నరేంద్రమోడీ సర్కార్. భారత్ లో భారీ స్థాయిలో మెజారిటీని సంపాదించుకొని అధికారంలోకి వచ్చిన మోడీ సర్కారు తను చేపట్టిన ఒక కార్యక్రమం ద్వారా గిన్నిస్ లోకి ఎక్కింది. గత స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిష్టాత్మకంగా జన్ ధన్ యోజన అను కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ప్రజలందరినీ బ్యాంకింగ్ వ్యవస్థలో భాగం చేయాలని.. జీరో బ్యాలెన్స్ తో అకౌంట్ ను ప్రారంభింపజేయడానికి అవకాశం ఇస్తూ మోడీ స్వహస్తాలతో ఈ కార్యక్రమం ప్రారంభించారు, ఈ కార్యక్రమం కింద పది కోట్ల మంది చేత కొత్తగా అకౌంట్లను ప్రారంభింపజేయడమే లక్ష్యమని మోడీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆ లక్ష్యాన్ని చేధించింది. అదే ఇప్పుడు గిన్నిస్ రికార్డు అవుతోంది. భారీ సంఖ్యలో బ్యాంక్ ఖాతాలు ప్రారంభించడం అనే గిన్నిస్ బుక్ రికార్డును సాధించింది మోడీ ప్రభుత్వం. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు కేంద్ర ప్రభుత్వానికి ధ్రువీకరణ పత్రాన్ని ఇచ్చారు. మరి ఇది మోడీ సర్కారు సత్తాకు ఒక నిదర్శనం అని చెప్పవచ్చు. ప్రజలందరినీ బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానం చేయడం అభినందించదగ్గ విషయమేనని చెప్పవచ్చు. అయితే ఊరికే జీరో బ్యాలెన్స్ అకౌంట్లను ప్రారంభింపజేస్తే కాదు.. ప్రజలందరినీ బ్యాంకులకు రెగ్యులర్ కష్టమర్లను చేయడాన్ని ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలి. ప్రజలకు అలాంటి ఆర్థిక శక్తిని సమకూర్చాలి. అప్పుడు ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతంఅయినట్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: