తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారంనాడు దావోస్‌నుంచి టెలీ కాన్ఫరెన్స్‌ జరిపారు. దావోస్‌ పర్యటనలో ఉన్న చందద్రబాబు నాయుడు అక్కడినుంచి టీటీడీపీ నేతలతో టెలీ కాన్ఫరెన్‌ద్వారా కీలక అంశాలపై చర్చించారు. పలు కీలక సూచనలతోపాటు పార్టీ నేతలు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ కాన్ఫరెన్స్‌లో చర్చించారు. తెలంగాణ రాష్ట్ర సమితి చేస్త్తున్న విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని, ప్రజా సంక్షేమ పథకాల అమలులో లోెపాలను ఎత్తిచూపాలని ఆయన టీటీడీపీ నేతలు ఆదేశించారు. టీఆర్‌ఎస్‌ చేస్త్తున్న ఏ ఒక్క విమర్శనూ ఉపేక్షించవద్దని ధైర్యం నూరిపోశారు. కొందరు పార్టీ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారనే విషప్రచారం జరుపుతున్నారని, తప్పుడు కథనాలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భవిష్యత్‌లో టీఆర్‌ఎస్‌కు ధీటుగా ఎదిగే పార్టీగా టీడీపీని చూసి ప్ర్‌భుత్వం భయపడుతోందని,ప్రజాపక్షం వహించి ప్రభుత్వంపై మరింత ఉధృత పోరాటం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. తప్పుడు కథనాలు, అపోహలను నవమ్మొద్దని, తన తెలంగాణ పర్యటనపై లేనిపోని రాద్దాంతం సృష్టించి వివాదం సృష్టిస్త్తున్నారని, దీనిని గట్టిగా ఎదుర్కొని, ప్రజలను సమాయత్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవలే జరిగిన కంటోన్మెంట్‌ ఎన్నికలపై సమీక్ష జరుపుకుని రానున్న గ్రేటర్‌ ఎన్నికలకు సిద్దం కావాలని సూచించారు. కలిసికట్టుగా వ్యవహరిస్తూ పార్టీని ప్ర్‌జల్లోకి తీసుకువెళ్లాలని, త్వరలో జరగనున్న సంస్థాగత ఎన్నికలపై దృష్టిపెట్టాలని సూచించారు. కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేయాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: