సునంద హత్య కేసులో శశి థరూర్-ను ప్రశ్నించింది సిట్. శశి ఇంటరాగేషన్ ఎలా సాగింది? ఏయే ప్రశ్నలకు థరూర్ ఏం సమాధానం ఇచ్చారు. సునందని కొట్టానని ఒప్పుకొన్నారా? ఎయిమ్స్-కి పంపిన మెయిల్స్ గురించి ఏం చెప్పారు? పాక్ జర్నలిస్ట్ మెహర్ తరార్-తో దుబాయ్-లో గడిపిన అరేబియన్ నైట్స్ గురించి ఏం సమాధానం ఇచ్చారు. శశి విచారణపై ప్రత్యేక కథనం. టైమ్- జనవరి 19. రాత్రి 8గంటలు. ప్లేస్- ఢిల్లీ. వసంత విహార్ పోలీస్ స్టేషన్. -సునంద హత్య కేసులో శశి థరూర్-ను విచారించిన సిట్. సెన్సేషన్ సృష్టించిన సునంద హత్య కేసులో ఆమె భర్త శశి థరూర్-ను విచారించింది సిట్. సునంద చనిపోయిన ఏడాది తర్వాత శశి థరూర్-ను స్టేషన్-కు పిలిపించి ప్రశ్నించింది. నలుగురు సభ్యుల టీమ్ థరూర్-ని ఇంటరాగేషన్ చేసింది. థరూర్-పై 10- 15 ప్రశ్నలు సంధించింది. శశి థరూర్ విచారణ ఎలా జరిగింది? సిట్ అడిగిన ప్రశ్నలకు శశి ఏం సమాధానం ఇచ్చారు? ఇంటర్నల్ ఇంటరాగేషన్-పై ఎక్స్ ప్రెస్ ఎక్స్-క్లూజివ్ కథనం. సునంద మీరు గొడవపడ్డారా? అని అడిగితే ఔనని సమాధానం వచ్చింది. మీరు ఆమెను కొట్టారా? అని ప్రశ్నిస్తే ఎప్పుడూ కొట్టలేదని సెలవిచ్చారు శశి. ఆమె బాడీ మీద 15 గాయాలున్నాయి అవి ఎలా అయ్యాయని నిలదీస్తే మౌనమే సమాధానం వచ్చింది. సునందలో చలనం లేకపోతే అంబులెన్స్-కో, హండ్రెడ్-కో ఎందుకు ఫోన్ చేయలేదు? ఆమెను వెంటనే ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లలేదని అడిగితే ఏం చెప్పాలో తెలియక కాసేపు నీళ్లు నమిటారు ధరూర్. అధికారుల వైపు చూస్తూ ఉండిపోయారు. సునంద ఫలానా కారణాలతో చనిపోయి ఉంటుందని చెప్పమంటూ మీరు ఎయిమ్స్ డైరెక్టర్-కు మెయిల్స్ ఎందుకు చేశారని ప్రశ్నిస్తే మొదట షాక్-కు గురయ్యారు శశి. ఏం చెప్పమంటారన్నట్టుగా చూస్తూ ఉండిపోయారు.  సునందకి లూపస్ వ్యాధి లేకపోయినా ఉందని ఎందుకు చెప్పారని నిలదీస్తే ఇంత కీలక ప్రశ్నకు కూడా మళ్లీ మౌనమే సమాధానం వచ్చింది. కాళ్లు ఊపుకుంటూ దిక్కులు చూస్తూ గడిపేశారు. సునందకి ఆల్-ప్రక్స్ టాబ్లెట్లను డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేయనప్పుడు ఆమె రూమ్-లో ఆ టాబ్లెట్టు ఎందుకున్నాయని ప్రశ్నిస్తే నాకేం తెలుసన్నట్టుగా భుజాలు, చేతులు, కళ్లు ఎగరేసి తన హావభావాలతో సమాధానమిచ్చారు థరూర్. సునందను నిద్ర లేపడానికి వెళ్లినప్పుడు ఏం జరిగింది? మీకు అక్కడ ఏమైనా కనిపించాయా? అని అడిగితే మాత్రం థరూర్ భావోద్వేగానికి లోనయ్యారు. సునంద తనను అన్యాయం చేసి వెళ్ళిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ క్షణాలు తన జీవితంలో అత్యంత దుర్భరమైనవి అంటూ సెంటిమెంట్-కు లోనయ్యాడు. మీకు మెహర్ తరార్ ఎలా తెలుసు? అని అడిగితే ఓ జర్నలిస్టుగా తెలుసని సమాధానం ఇచ్చిన శశి తరూర్ మీరు ఆమెతో దుబాయ్-లో గడిపారా? అని అడిగితే మాత్రం సైలెంట్ అయిపోయారు. ఓ చిరునవ్వు నవ్వేసి ఊరుకున్నారు. ఇలా పోలీసులు అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి మరికొన్నిటికి మౌనమే సమాధానం ఇచ్చారు థరూర్. ఇంకొన్ని ప్రశ్నలకు చిరునవ్వు నవ్వి తాను చెప్పే సమాధానాలు నోట్ చేసుకోమంటూ పోలీసులకు సూచనలిచ్చినట్టు తెలుస్తోంది. స్టేషన్-లో అడుగుపెట్టేటప్పుడు కొంచెం టెన్షన్-గా ఉన్న శశి ఆ తర్వాత రిలాక్స్ అయిపోయినట్టు ఇన్ఫర్మేషన్. పోలీసులు అడిగిన ప్రశ్నలకు నీళ్లు నమిలిన ఈ కేంద్ర మాజీ మంత్రి వారు ఆఫర్ చేసిన టీ కాఫీ కాదని కేవలం వాటర్ తాగినట్టు సమాచారం. రాత్రి 8 గంటల నుంచి సమారు నాలుగు గంటల పాటు జరిగిన ఇంటరాగేషన్ ముఖ్యంగా జనవరి 17న జరిగిన సన్నివేశాల చుట్టూ తిరిగినట్టు తెలుస్తోంది. మరోసారి విచారణకు హాజరవ్వాల్సి ఉంటుందని చెప్పి పంపించారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: