తెలంగాణ రాష్ట్రాన్ని గత కొద్ది రోజులుగా వణికిస్తున్న సై్వన్‌ ఫ్లూ కట్టడికి ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రంలో రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగు తుండటంతో పాటు పాజిటివ్‌ కేసులు కూడా భారీ సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ బుధవారం సచివాల యంలో సై్వన్‌ ఫ్లూ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎస్‌ రాజీవ్‌ శర్మ, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సై్వన్‌ ఫ్లూ వ్యాప్తి పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ మరింత ముందుగా మేల్కొనాల్సి ఉందన్నారు. రాష్టవ్య్రాప్తంగా దీని నియంత్రణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఉదయమే ప్రధాన మంత్రికి ఫోన్‌ చేసి నిపుణుల బృందాన్ని, అవసరమైన మందులను పంపాలని విజ్ఞప్తి చేశారు. కేవలం సై్వన్‌ ఫ్లూ నియం త్రణకు చేపట్టాల్సిన చర్యలే ప్రధాన అంశంపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా కేబినెట్‌ సమావేశాన్ని నిర్వహించారంటే దీని తీవ్ర తను అర్థం చేసుకోవచ్చు. మంత్రులు, ఎమ్మెల్యేలకూ తమ నియో జకవర్గాలలో పరిస్థితిని సమీక్షించాలని సీఎం ఆదేశించారు. తెలం గాణలో సై్వన్‌ ఫ్లూకు చిన్నారులు బలి కాకుండా ఒక దశలో పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని భావించినప్పటికీ తిరిగి దానిని ఉపసంహరించుకున్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణలో సై్వన్‌ ఫ్లూ బారిన పడి ఇప్పటి వరకు 21 మంది మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. కేవలం మంగళవారం ఒక్క రోజే ముగ్గురు మృతి చెందడం పరిస్థితి తీవ్రతను నిదర్శనం. రోజుకు కనీసం 50 కేసులు పాజి టివ్‌ కేసులు నమోదవుతున్నట్లు సమాచారం. అయితే, ఫ్లూ అనేది అందరికీ వచ్చేదేననీ, దీని నివారణకు మందులు ఉన్నాయని కార్పొరేట్‌ ఆసుపత్రులకు చెందిన వైద్యులు తెలిపారు. సై్వన్‌ ఫ్లూ నియంత్రణపై సీఎం కేసీఆర్‌ సచివాలయంలో కార్పొరేట్‌ ఆసుపత్రుల యాజమాన్యాలతో సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సై్వన్‌ ఫ్లూ సహజంగా ప్రాణాంతక వ్యాధి కాదనీ, అయితే ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా చలి తీవ్రత దృష్ట్యా ఈ వ్యాధి కారక వైరస్‌ విజృంభిస్తున్నదని స్పష్టం చేశారు. సై్వన్‌ ఫ్లూ నిర్ధారణకు తమ వద్ద ఆధునిక పరికరాలు ఉన్నాయని తెలిపారు. మరోవైపు సై్వన్‌ ఫ్లూపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో లోపం జరిగిందని డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి రాజయ్య పేర్కొన్నారు. రాష్టవ్య్రాప్తంగా 12 వేల డోసుల సై్వన్‌ ఫ్లూ నియంత్రణ డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మరో 50 వేల డోసులు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో విజృంభిస్తున్న సై్వన్‌ ఫ్లూ నియంత్రణకు సీఎం కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించాలని కోరారు. దీనికి స్పందించిన ప్రధాని మోదీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా ఒక సైంటిస్టుతో కూడిన వైద్యుల బృందాన్ని హైదరాబాద్‌కు పంపేందుకు అంగీకరించారు. దీంతో పాటు సై్వన్‌ ఫ్లూ నివారణకు సంబంధించి 50 వేల డోసులు, 10 వేల సిరప్‌లు పంపించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే సై్వన్‌ ఫ్లూ తెలంగాణలోనే విజృంభిస్తున్నదనీ, దీని నియంత్రణకు అన్ని విధాల సహకారాలు అందజేస్తామని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: