1995 లో టిడిపిలో తిరుగుబాటు వచ్చినప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట నడిచిన మాజీ మంత్రి సి.రామచంద్రయ్య ,ఇప్పుడు కొత్త వాదన తెస్తున్నారు.తాను కూడా అప్పుడు మోసపోయానని ఆయన అంటున్నారు.ఎన్.టి.ఆర్.భార్య లక్ష్మీపార్వతిని రాజ్యింగ వ్యతిరేక శక్తిగా చూపిస్తూ ఎమ్మెల్యేలను నమ్మించి మోసం చేశారని ఆయన అన్నారు.అలా మోసపోయినవారిలో తాను కూడా ఒకరినని రామచంద్రయ్య అన్నారు.గతంలో ఎన్.టి.ఆర్.తన కుమారుడు బాలకృష్ణను వారసుడని ప్రకటించినప్పుడు ఆయనను మళ్లీ ఒప్పించి,వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేశారని అన్నారు.ఇప్పుడు లోకేష్ ను రాజ్యాంగేతర శక్తిగా మార్చారని రామచంద్రయ్య అన్నారు. రామచంద్రయ్య చెబుతున్నది బాగానే ఉంది.కాని 1995 లో టిడిపిలో తిరుగుబాటు వచ్చాక, రామచంద్రయ్య పార్టీ ముఖ్యనేతలలో ఒకరిగా చంద్రబాబు వెంటే ఉండేవారు.ఆ తర్వాత పార్టీ పక్షాన రెండుసార్లు రాజ్యసభ సభ్యుడయ్యారు.చిరంజీవి పార్టీ పెట్టేవరకు అక్కడే ఉన్నారు.ఇప్పుడు తాను కూడా మోసపోయానని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: