నూత నంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి విదేశీ పెట్టు బడులు రాబట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్‌లో పలు విదేశీ కార్పొరేట్‌ అధిపతులతో భేటి అయ్యారు. దావోస్‌ పర్యటనలో భాగంగా మూడవ రోజైన గురువారం వివిధ పారిశ్రామిక సంస్ధల ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రలో వనరులు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ప్రెజంటేషన్‌ ఇచ్చారు. నిరంతర విద్యుత్‌ సరఫరా, పుష్కల జల వనరులు, ఖనిజ సంపద, రవాణా సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరంగా పారిశ్రామిక రంగానికి ఇతోధిక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. దేశంలోని ప్రముఖ వాణిజ్యవేత్తలు అది గోద్రేజ్‌, ప్రకాష్‌ హిందూజ, రాజీవ్‌ మిట్టల్‌, అతుల్‌ పంజు, వినోద్‌ మిట్టల్‌, సీయిమన్‌ ప్రతినిధి సెషన్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు చంద్రబాబు నాయుడు విజన్‌ను, నాయకత్వ లక్ష్యాలను ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబ డులు పెట్టేందుకు ఆసక్తిని వ్యక్తం చేశారని గురువారం అధికారికంగా వెలువడిన ఒక ప్రకటన పేర్కొంది. ఈ సమావేశంలో స్పెయిన్‌ సందర్శించాలని చంద్ర బాబు నాయుడును స్పానిష్‌ ప్రతినిధులు ఆహ్వానించారు. అక్కడ వారి బుల్లెట్‌ ట్రైన్‌ నమూ నాను అధ్యయనం చేయాలని కోరారు.  స్మార్ట్‌ సిటీలను, టూరిజం నమూనాలను కూడా పరిశీలించాలని కోరారు. తాము త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తామని రాష్ట్ర ప్రతినిధి బృందానికి తెలిపారు. భారత్‌కు చెందిన పలువురు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, విద్యావేత్తలతో కూడిన గ్లోబల్‌ ఎజెండా కౌన్సిల్‌ (జీఏసీ) ఇండియా టీమ్‌తో సమావేశమైన చంద్ర బాబు నాయుడు కొత్త రాష్ట్రంలో సవాళ్ళను, పెట్టుబడి అవకాశాలను వారికి వివరించారు. భారత్‌ ఫోర్జ్‌ చైర్మన్‌ బాబా ఎన్‌ కళ్యాణి, ఎగ్జి క్యూటివ్‌ డైరెక్టర్‌ అమిత్‌ కళ్యాణితో కూడా చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కళ్యాణి మాట్లాడుతూ ప్రధానమైన మూడు రంగాలలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేం దుకు తాము ఆసక్తిని కనబరుస్తున్నట్లు చెప్పారు. రక్షణ, సాంకేతిక, క్షిపణి రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. దీనికి చంద్రబాబు స్పందిస్తూ పెట్టుబడి ప్రతిపాదనలను తక్షణమే పరిశీలించి 21 రోజుల్లో ఆమోదం తెలుపుతామని హామీ ఇచ్చారు. కాగా ఆంధ్రప్రదేశ్‌ అధికారులు, స్విస్‌ కన్సార్టియం సంయుక్త కమిటీ ఒకటి త్వరలో ఏర్పాటు కానుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నీటి యాజమాన్యం, పునరుత్పాదన హైబ్రిడ్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌, స్మార్ట్‌ నగరాలు, సార్ట్‌ గ్రామాల క్లస్టర్ల కీలక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ఒక మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. గురువారం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ నగరంలో ఎనేబులర్స్‌ ఫర్‌ స్మార్ట్‌ సిటీస్‌' అంశంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్విస్‌ సోలార్‌ టెక్నాలజీ కన్సార్టియం సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఈ విష యాన్ని ప్రకటించారు. ఈ సదస్సుకు ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కె.రామ్మోహన్‌రావు, పార్లమెంట్‌ సభ్యులు సిఎం. రమేష్‌, ఎపిస్పెషల్‌చీఫ్‌సెక్రటరీ (ప్లానింగ్‌) ఎస్‌పి. ఠక్కర్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీలు అజరు జైన్‌, ఎస్‌ ఎస్‌.రావత్‌తో కూడిన ప్రతినిధి బృందం హాజరైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: