కేంద్ర మంత్రి సుజనా చౌదరికి తెలంగాణ సచివాలయంలో చుక్కెదురైంది. ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసేందుకు గురువారం సుజనా చౌదరి సచివాలయానికి వచ్చారు. కేంద్ర మంత్రి నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి రాగా, ఆయన లేరని తెలియగానే, ఆ విషయాన్ని తనకు ముందుగా ఎందుకు చెప్పలేదని కేంద్ర మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. తనకు జరిగిన అవమానంపై ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావును కలిసి కేంద్ర మంత్రి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. పైగా తాను ముఖ్యమంత్రిని కలువడానికి వస్తున్నట్టు ముందుగా సమాచారం ఇవ్వగా, రెండు గంటలకు రావాల్సిందిగా అధికారులు అపాయింట్‌మెంట్ ఇచ్చినట్టు సుజనా చౌదరి ఈ సందర్భంగా గుర్తు చేసినట్టు తెలిసింది. అలాగే తాను ముఖ్యమంత్రి కార్యాలయంలోకి ప్రవేశించబోతున్నట్టు సెక్యూరిటీ వాళ్లు సమాచారం ఇచ్చినప్పటికీ, కనీసం లిఫ్ట్ కూడా సిద్ధంగా పెట్టకపోవడం ఏమిటని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇలా ఉండగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలువడానికి తాను వస్తున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం ఇవ్వగా, రెండు గంటలకు రావాల్సిందిగా అధికారులు అపాయింట్‌మెంట్ ఇచ్చినట్టు తెలిసింది. అయితే మూడు గంటలకు కేంద్ర మంత్రి సచివాలయానికి నేరుగా రాగా, ముఖ్యమంత్రి ఈరోజు సచివాలయానికే రాలేదని అధికారులు తెలుపడంతో, ఆ విషయాన్ని తనకు ముందుగా ఎందుకు చెప్పలేదని అధికారులపై అసహనం వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: