అసలు చంద్రబాబు గతంలో తను వ్యవహరించిన తీరుకు ఎప్పుడూ సమాధానం చెప్పడా?! గతం గతమే.. వర్తమానం వర్తమానమే.. అంటూ భవిష్యత్తుపై లేని పోని మాయలు కనిపిస్తూ పనిచేయడమే ఈయన నైజమా! రీటైల్ మార్కెటింగ్ లో ఎఫ్ డీఐలను చంద్రబాబు ప్రభుత్వం గతంలో తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ వ్యవహారం రాజ్యసభలో, లోక్ సభలో చర్చకు వచ్చినప్పుడు బాబు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా నిరసించింది. వాల్ మార్ట్ వంటి కంపెనీలు భారత మార్కెట్ ను, ఇక్కడ కిరణా షాపుల వాళ్ల జీవితాలను నాశనం చేస్తాయని అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే అప్పుడు అలా చెప్పిన బాబు అండ్ కో ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చే సరికి మాట మార్చింది. ఇప్పుడు ఏపీలో సర్వాన్నీ వాల్ మార్ట్ చేతిలోకి పెడతామని చెబుతోంది. ఇదొ పెద్ద గొప్ప అని ప్రచారం కూడా! మరి ఇలా రీటైల్ మార్కెట్ ఎఫ్ డీఐ లకు బాబు ప్రభుత్వం పూర్తిగా వాకిళ్లు తెరవడం వల్ల చాలా నష్టాలే ఉంటాయి. రాష్ట్రంలో పండే సర్వపంటలపై మార్కెటింగ్ హక్కు బాబు ప్రభుత్వం వాల్ మార్ట్ కు అప్పజెప్పనుంది. తద్వారా మన దగ్గర పండే పంటను మన వాళ్ల ద్వారా కొనుక్కొంటున్న మనం.. ఇకపై వాల్ మార్ట్ నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆ అమెరికా సంస్థ నిర్ణయించే ధరలను చెల్లించి! పండించేది మనం, కొనుగోలు చేసేది మనం.. అయితే ధరలను వాల్ మార్ట్ నిర్ణయిస్తుంది. దీని వల్ల జరిగే నష్టం ఏమిటో ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. దళారిగా వ్యవహరించే ఆ సంస్థ పొట్ట నింపుకొంటుంది. రైతులకు ఎటవంటి ప్రయోజనమూ ఉండదు. అయితే కొనుగోలు చేయాల్సి వచ్చినప్పుడు భారీ స్థాయిలో మనం చెల్లింపులు చేసుకోవాలి! ఓవరాల్ గా ఈ ఎఫ్ డీఐల వల్ల కలిగే నష్టం ఇది. అయితే దీన్ని కూడా బాబు అండ్ కో తమ ఘనత గా ప్రచారం చేసుకొంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: