గాలి జనార్ధన్ రెడ్డి.. భారతీయ జనతా పార్టీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన నేత. ఎమ్మెల్సీ హోదాలో మంత్రిగా కూడా పనిచేశాడు. కర్ణాటక రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా వ్యవహరించాడు. అయితే ఆయన మైనింగ్ స్కామ్ లో జైలు పాలయ్యే సరికి మాత్రం భారతీయ జనతా పార్టీ ఆయనతో తమకు ఎలాంటి సంబంధం లేదనట్టుగా వ్యవహరించసాగింది. అయితే బళ్లారిలో గాలి అనుచరులు తమ సత్తా చాటుతూనే ఉన్నారు.

బళ్లారి ఎంపీ అయిన శ్రీరాములు గాలికి ముఖ్య అనుచరుడు. అలాగే గాలి సోదరుడు కరుణాకర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కూడా.వీరందరూ భారతీయ జనతా పార్టీలో క్రీయాశీలంగా ఉన్నారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తిరిగి కర్ణాటకలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలనేది కమలదళం లక్ష్యం. ఈ నేపథ్యంలో అందుకు తగ్గ అస్త్ర శస్త్రాలను బీజేపీ సిద్ధం చేసుకొంటోంది.

అందుకే గాలి జనార్ధన్ రెడ్డిని కూడా ఇప్పడు సన్నద్ధం చేసిందని వార్తలు వస్తున్నాయి. ఎంతకాదనుకొన్నా గాలిని తమ పార్టీ వాడిగానే లెక్కేసుకొంటోంది భారతీయ జనతా పార్టీ. అతడు బళ్లారి జిల్లాలో పార్టీని రక్షించగలడనే వ్యూహంతోనే బయటకు తీసుకు వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బెయిల్ నేపథ్యంలో గాలి జనార్ధన్ రెడ్డి తిరిగి పొలిటికల్ గా యాక్టివ్ అవుతాడని.. భారతీయ జనతా పార్టీనే అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇక ఆయనను సీబీఐ పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి బీజేపీలో గాలి జనార్ధన్ రెడ్డి వ్యవహారం ఇకపై ఎలా ఉండబోతోందో!

మరింత సమాచారం తెలుసుకోండి: