ఇన్ని రోజులూ నారా లోకేష్ బాబు పుట్టిన రోజు ఎప్పుడో తెలుగుదేశం కార్యకర్తల్లో కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే అధికారం చేతికి అందింది... లోకేష్ బాబు వెలిగిపోతున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన పుట్టిన రోజు తెలుగుదేశం పార్టీకి పెద్ద పండగే అవుతోంది. ఈ మేరకు శుక్రవారం రోజున నారా లోకేష్ పుట్టిన రోజును తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నాయి.

అభిమానులు లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆసుపత్రుల్లో పాలూ, పళ్లను పంచడం , పార్టీ ఆఫీసుల వద్ద కేక్ కటింగులు చేయడం... పటాసులు కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేయడం చేస్తున్నారు. ప్రత్యేకించి ఏపీ లో లోకేష్ పుట్టిన రోజు హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది. ఇక ఫేస్ బుక్ , ట్విటర్లలో కూడా లోకేష్ బాబు పుట్టిన రోజు హడావుడి కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అభిమానులు, సానుభూతి పరులు లోకేష్ ను విష్ చేస్తున్నారు.

మొత్తానికి జనవరి 23 అనేది తెలుగుదేశం పార్టీకి కొత్త పండగ అవుతోంది. ఇది వరకూ ఎన్నడూ జరగని ఉత్సవాన్ని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నిర్వహిస్తోంది. మరి అధికారంలోకి వచ్చినప్పుడే ఇలాంటి ముచ్చట్లు ఉంటాయి. ఒకవేళ టీడీపీ ఇప్పుడు అధికారంలోకి రాకపోయుంటే.. లోకేష్ పుట్టిన రోజు సంబరాలు కేవలం ఫేస్ బుక్ కే పరిమితం అయ్యేవి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి, చంద్రబాబు పుట్టిన రోజులు ప్రధాన పండగలుగా ఉండగా.. ఇప్పుడు దానికి లోకేష్ బాబు పుట్టిన రోజు కూడా తోడయ్యింది!

.

మరింత సమాచారం తెలుసుకోండి: