బీహార్‌లోని ఆరా సివిల్‌ కోర్టు ప్రాంగణంలో శుక్రవారం బాంబు పేలుడు సంభ వించింది. ఇందులో కానిస్టేబుల్‌, మహిళ మృతి చెం దారు. ఆ మహిళను మానవ బాంబుగా అనుమానిస్తు న్నారు. బాంబు పేలుడుకు న్యాయవాదులు సహా 16 మంది గాయపడ్డారు. విచారణ ఖైదీలను తప్పించే ప్రయత్నంలో భాగంగా బాంబు పేలుడు జరిగినట్లు భావిస్తున్నారు. ఉదయం 11:30 గంటల సమయం లో బాంబు పేలుడు సంభవించిందని అదనపు డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే పీటీఐకి చెప్పారు. విచారణ ఖైదీలతో వ్యాను కోర్టు ఆవరణలోకి ప్రవేశించడం, వారిని కోర్టు లాకప్‌కు తరలించిన సమయంలో బాంబు పేలుడు జరిగిందన్నారు. 35-40 ఏళ్ల వయస్సు గల మహిళ మానవబాంబుగా పేలుడుకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నట్లు ఏడీజీ చెప్పారు. ఆమె మానవబాంబు కావడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. బాంబు శకలాలు ఆ మహిళ శరీరంలోకి దూసుకుపోయినట్లు గుర్తించారు. మొబై ల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అమిత్‌కుమార్‌ అనే కానిస్టేబుల్‌, మహిళ మృతిచెందినట్లు ఏడీజీ చెప్పారు. బాంబు పేలుడును ఉగ్రదాడిగా భావించలేమని పాండే తెలిపారు. విచారణ ఖైదీలను సహకరించేందుకే బాంబు పేలుడు జరిగిందని బీహార్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంజనీ కుమార్‌ సింగ్‌ వెల్లడించారు. 2009లో ఆరా కోర్టు ప్రాంగణం నుండి ఇదే తరహాలో తప్పించుకునేందుకు ప్రయత్నించిన లంబూ శర్మ ముఠాయే ఈ పేలుడుకు పాల్పడినట్లు అనుమాని స్తున్నారు. పేలుళ్లను అవకాశంగా తీసుకొని ఇద్దరు ఖైదీలు పారిపోవడానికి ప్రయత్నించినట్లు ఆరా ఎస్‌పీ అక్తర్‌ హుస్సేన్‌ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: