పరిటాల రవీంద్ర, ఒకప్పుడు అనంతపురం జిల్లా రాజకీయాలను శాసించిన నేత. నక్సలిజం కోసం పనిచేసి.. ఆ తర్వాత రాజకీయాల బాట పట్టిన ఈ నేత జీవితం.. ఆద్యంతం ఉత్కంఠభరితం. గుండెల నిండా ధైర్యం, నమ్ముకున్న జనం కోసం ఏదైనా చేయగల సాహసమే ఆయన్ను నాయకుడిని చేశాయి. ఆయన ప్రత్యర్థుల దాడికి బలై నేటికి పది సంవత్సరాలు. మరణించి పదేళ్లైనా.. ఆయన అభిమానుల్లో రవి పట్ల కించిత్ అయినా తగ్గలేదంటే అతిశయోక్తి కాదు.  అనంతపురం జిల్లా వెంకటాపురంలో పరిటాల రవి 10వ వర్దంతి ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ఏపీ స్పీకర్ కోడెలతో పాటు పలువురు రాజకీయ నేతలు హాజరుకానున్నారు. ప్రత్యేకించి.. బాలీవుడ్ హీరో.. వివేక్ ఒబెరాయ్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. రక్తచరిత్ర సినిమాను మూడు భాషల్లో రూపొందించినప్పుడు పరిటాల రవి పాత్రను వివేక్ పోషించారు. ఆ సమయంలోనే రవి గురించి కూలంకషంగా తెలుసుకున్న వివేక్ ఒబెరాయ్.. ఆయన అభిమానిగా మారారు.  ఆ అభిమానం కారణంగానే వివేక్ ఒబెరాయ్ పరిటాల పదో వర్ధంతి కార్యక్రమానికి వస్తున్నారు. ఈ కార్యక్రమానికి లక్షమందికి పైగా తరలివస్తారని భావిస్తున్నారు. అందుకు నటుడు వివేక్ ఒబెరాయ్ రాప్తాడు నియోజకవర్గంలోని ఏదైనా గ్రామాన్ని దత్తతకు తీసుకునే అవకాశం కూడా ఉందట. ఆ విషయాన్ని వివేక్ స్వయంగా వెల్లడించే అవకాశం ఉంది.

.

.

.

మరింత సమాచారం తెలుసుకోండి: