కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు టీడీపీ మంత్రులకు చురకలు అంటించారు. ఎవరికి వారు ప్రత్యేక హోదా, కేంద్ర నిధులపై ఇష్టం వచ్చినట్లు ప్రకటనలు చేయటంపై వెంకయ్య అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులో ఉందని, కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు వస్తాయంటూ గొప్పలు చెబుతూ వస్తున్నారు. మరో కేంద్ర మంత్రి సుజనా చౌదరి (టీడీపీ) ఏకంగా రెండు వేల కోట్ల రూపాయల నిధులు త్వరలో వస్తున్నాయని ప్రకటించేశారు. మంత్రులు ఇలాంటి అనవసర ప్రకటనలు చేయటం మానుకోవాలని వెంకయ్య బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇటీవల టీడీపీ, బీజేపీ మధ్య మైత్రీ సంబంధాలు దెబ్బతింటున్నాయి. రాష్ట్రంలో పాగా వేసందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే విజయవాడ - గుంటూరు మధ్య కృష్ణాకరకట్ట పక్కనే రాష్ట్ర కార్యాలయం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అదే సమయంలో విజయవాడలో సొంతంగా భారీ బహిరంగ సభను కూడా శనివారం నిర్వహించింది. 2019నాటికి రాష్ట్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. ఆ క్రమంలోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశంపై బీజేపీ కరాకండీగా వ్యవహ రిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: