తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ పర్యటన దాదాపుగా ఖరారైంది. ఫిబ్రవరి11న వరంగల్‌ జిల్లా పాలకుర్తిలో పర్యటించేందుకు రంగం సిద్దమైంది. ఈవిషయంపై శనివారం యువనేత నారాలోకేష్‌, తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్‌.రమణ, ఎర్రబెల్లి ద యాకర్‌రావు, గరికపాటి రామ్మోహన్‌రావు, సీతక్క, వేంనరేందర్‌రెడ్డి, టిడి జనా ర్ధన్‌రావు, జయరామ్‌రెడ్డి తదితరులు భేటి అయ్యారు. ఈ భేటిలో వరంగల్‌ జిల్లా తెలుగుదేశంపార్టీ నేతల మధ్య సమన్వయం కొరవడిందని, క్యాడర్‌లో భరోసా నింపేందుకు కార్యక్రమాలను చేపట్టాలని యువనేత లోకేష్‌ సూచించారు. వరంగల్‌ జిల్లాలోని 14 నియోజక వర్గాల్లో 31 నుంచి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సుమారు వారం రోజుల పాటు జిల్లా నేతలు ఆయా పర్యటనలు చేయడంతోపాటు క్యాడర్‌ను చంద్రబాబు పర్యటనకు క్యారోన్ముఖులు చేయాలని నిర్దేశించారు. అంతకు ముందే జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించడంతోపాటు బహిరంగ సభను ఏర్పాటు చేయాలని సూచించారు. వరంగల్‌ జిల్లాలో తెలుగుదేశం పార్టీ క్యాడర్‌బలంగా ఉన్నప్పటికీ వారికి దిశానిర్ధేశనం చేసే నేతలు కరువయ్యారు.  ద్వితీయశ్రేణి నేతలు సైతం ఆభద్రతా భావంతో పార్టీని వీడుతున్నారు. నేతలు అంతా సమన్యయంతో వ్యహారించాలి. వారిలో భరోసా నింపేందుకు చర్యల తీసుకోవాలని చినబాబు హితభోధ చేశారు. నియోజక వర్గ నేతలు ఆయా కార్యకర్తలకు అందుబాటులో ఉండి వారి సాధక భాధకాలను తీర్చేందుకు కృషి చేయాలని నిర్ధేశించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి ఇప్పడు ఓడిపోయాక క్యాడర్‌ను పట్టించుకోక పోతే ఎలా అని నేతలను సున్నితంగా మందలించినట్లు తెలిసింది. క్యాడర్‌ సమస్యల పరిష్కరించేందుకు తాను అన్ని విధాల సిద్దంగా ఉన్నట్లు లోకేష్‌ స్పష్టం చేశారు. ప్రతి నియోజక వర్గంలోను చంద్రబాబు పర్యటన ఉంటుందని, కార్యకర్తలతో నేరుగా ముఖాముఖి నిర్వహించి కష్ట సుఖాలను తెలుసుకుంటారని లోకేష్‌ చెప్పినట్లు తెలిసింది. పర్యటన విజయవంతం చేయడం ద్వారా క్యాడర్‌లో జోష్‌ పెరుగుతుందని, పార్టీశ్రేణులను కాపాడుకోవడానికి మాత్రలాగా పనిచేస్తోందని చెప్పినట్లు సమాచారం. కావున పర్యటన ఎట్టి పరిస్ధితుల్లోను విజయవంతం చేయడానికి క్యాడర్‌ను సిద్ధం చేయాలని టిడిపి నేతలకు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: